బ్రిటీష్‌ పాలన కంటే అధ్వానం

18 Sep, 2018 02:26 IST|Sakshi

కేసీఆర్‌పై ఉత్తమ్‌ ధ్వజం

జైలులో జగ్గారెడ్డిని కలిసిన నేతలు

హైదరాబాద్‌: కేసీఆర్‌ పాలన బ్రిటీష్‌ పాలన కంటే అధ్వానంగా ఉందని, మానవ హక్కులకు విలువలేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నకిలీ పాస్‌పోర్టు కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని సోమవారం ఉత్తమ్‌తో పాటు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి ములాఖత్‌లో కలిశారు. అనం తరం జైలు వద్ద ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ది బందిపోటు కుటుంబమని, రాష్ట్రంలో పడి కుటుంబ సమేతంగా దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించినా, ఉద్యమించినా కేసీఆర్‌ అణగదొక్కుతున్నాడన్నారు. ఇందుకు జగ్గారెడ్డి అరెస్ట్‌ నిదర్శమన్నారు.

2004లో జరిగిన నకిలీ పాస్‌పోర్టు కేసులో రíషీద్‌æ అలీ అనే వ్యక్తి కేసీఆర్, హరీశ్, మాజీ ఎంపీ మధుసూదన్‌రెడ్డి, సోలిపేట లింగయ్య, అజీత్‌ రెడ్డి పేర్లను వెల్లడించాడని తెలిపారు. ఎక్కడా కూడా ఆ కేసులో జగ్గారెడ్డి పేరు లేదన్నారు. తెలంగాణ పోలీసులు కల్వకుంట్ల ప్రైవేటు సైన్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కావాలని కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేసిన వారిని ఎప్పటికీ వదలమని హెచ్చరించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది, తెలంగాణకు నిజాం నుంచి విముక్తి కల్పించింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. ఉత్తమ్‌ వెంట సీనియర్‌ నేతలు దామోదర రాజనర్సింహా,  మల్లు రవి, సుధీర్‌రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు