రాష్ట్రంలో పోలీసు పాలన

27 Oct, 2017 02:14 IST|Sakshi

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రంలో పోలీసు పాలన కొనసాగుతోందని, సీఎం కేసీఆర్‌ అణచివేత వైఖరిని అవలంభిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ చేపట్టగా సీఎం కేసీఆర్‌ ఎక్కడికక్కడ పోలీసు లతో అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. రైతాంగ సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని పేర్కొన్నారు.

మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డిని పరామర్శించేందుకు గురువారం నిజామాబాద్‌ జిల్లాలోని సిరాన్‌పల్లికి వచ్చిన కాంగ్రెస్‌ ముఖ్య నేతలు విలేకరులతో మాట్లాడారు.   రుణమాఫీపై వడ్డీని బకాయిలను ప్రభుత్వమే భరిస్తుం దని గత అసెంబ్లీ సమావేశాల్లో హామీనిచ్చి న సీఎం కేసీఆర్‌ ఇప్పటివరకు ఈ నిధులు విడుదల చేయలేదని ఉత్తమ్‌ విమర్శిం చారు.  నియంతృత్వపాలన కొనసాగుతోందని,  పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు.

మరిన్ని వార్తలు