చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక

27 Sep, 2019 03:31 IST|Sakshi

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికపై ఉత్తమ్‌

చింతలపాలెం (హుజూర్‌నగర్‌):హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పే ఎన్నిక అని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎవరు నిస్వార్థంగా పని చేశారో, ఎవరు పోలీసులను అడ్డం పెట్టుకుని గలీజు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ఇది అవినీతి అధికారానికి – నీతి నిజాయితీకి జరుగుతున్న పొరాటం అని అభివర్ణించారు. కాంగ్రెస్‌ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, జైలుకు పంపడం, జైలునుంచి విడుదల కాగానే వారిని బెదిరించి, మంత్రి జగదీశ్‌రెడ్డితో మాట్లాడించి పార్టీలో చేర్చుకోవడం టీఆర్‌ఎస్‌ గలీజు రాజకీయాలకు పరాకాష్ట అని ఉత్తమ్‌ ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌పై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. ‘కేటీఆర్‌ ఓ రాజకీయ బచ్చ.. మీ అయ్య ఇచ్చిన పదవితో విర్ర వీగవద్దు’అని హితవు పలికారు. 

నామినేషన్‌ వేసిన పద్మావతి
చింతలపాలెం (హుజూర్‌నగర్‌): హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ఊపందుకుంది. గురువారం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మావతిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మొత్తం ముగ్గురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కాంగ్రెస్‌ నుంచి పద్మావతి, హైదరాబాద్‌ హయత్‌నగర్‌కు చెందిన మేకల రఘుమారెడ్డి, సిద్ధిపేటకు చెందిన గజిబింకార్‌ బన్సీ లాల్‌ తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు.

నామినేషన్‌ వేస్తు్తన్న పద్మావతి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లే ఆఫ్స్‌కు దబంగ్‌ ఢిల్లీ

సర్వశక్తులూ ఒడ్డుదాం!

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత

‘చంద్రబాబుకు అందుకే అంత ఆక్రోశం’

బీజేపీలో చేరిన యోగేశ్వర్‌, సందీప్‌

హుజూర్‌నగర్‌ బీజేపీ అభ్యర్థి ఈయనే

దేశంలో మతోన్మాదం పెరిగిపోతుంది: సీపీఐ

‘అవినీతిని ఓడిద్దాం.. గుణపాఠం చెబుదాం’

రివర్స్‌ టెండరింగ్‌తో ఆదా ఆహ్వానించదగ్గ విషయం

మన్మోహన్‌కు శుభాకాంక్షల వెల్లువ!

అది ఎన్నికల కమిషనర్‌పై కక్షేనా!?

అమిత్‌షాను కలిస్తే బీజేపీలో చేరినట్టేనా?

మీ అయ్య ఇచ్చిన పదవులతో  విర్రవీగకు!

నాగార్జునరెడ్డి.. టీడీపీ ఏజెంట్‌: ఆమంచి

రేసులో సాకే, చింతా మోహన్‌, పద్మశ్రీ!

కాంగ్రెస్‌ నేతలకు సవాల్‌ : ఈద శంకర్‌రెడ్డి

ఎన్నార్సీపై కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ

‘రెవెన్యూశాఖలో అవినీతి, అక్రమాలు’

‘కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములు స్వాధీనం’

దేవతల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్టు..

‘ఇంత దిగజారి పోయారేంటి బాబు?’

నామినేషన్లు వేసేందుకు పార్టీలు సై 

హలో సర్పంచ్... చలో హుజూర్ నగర్

'ఎంపీ అరవింద్‌ పచ్చి అబద్ధాల కోరు'

నన్ను తరిమేయడానికి ఆయన ఎవరు?

‘లాలూ’కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది'

భూ ఆక్రమణదారులపై ఉక్కుపాదం

అది ముమ్మాటికీ అక్రమ కట్టడమే : ఆర్కే

టీఆర్‌ఎస్‌ గెలిస్తే ప్రజలకు లాభం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేణుమాధవ్‌కు కన్నీటి వీడ్కోలు

టీజర్‌ చూసి థ్రిల్‌ అయ్యాను

వైజాగ్‌ టు హైదరాబాద్‌

హ్యాపీ.. హ్యాపీ

శ్రీదేవి ఒక యాక్టింగ్‌ స్కూల్‌

తీవ్రవాదం నేపథ్యంలో...