ఈ ఏడాది చివరిలో ఎన్నికలు: ఉత్తమ్‌

25 Jan, 2018 02:43 IST|Sakshi

చింతలపాలెం/మఠంపల్లి: రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలో సార్వత్రిక ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం, మఠంపల్లి మండలాల్లో బుధవారం ఆయన పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని తెలిపారు. బీమా ప్రీమియం కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. అన్నిపంటలకు మద్దతుధర వచ్చేలా కృషి చేస్తామన్నారు. పత్తికి రూ.4,300 నుంచి రూ.6 వేలు, మిర్చి, పసుపు పంటలకు రూ.10 వేలు చెల్లిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 6 శాతం కమీషన్ల కోసమే కక్కుర్తిపడి మిషన్‌ కాకతీయ, భగీరథ ప్రాజెక్టులు చేపట్టారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అంటూ బంగారు కుటుం బంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇక టీఆర్‌ఎస్‌ పతనం ఖాయమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు