ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారు

30 Oct, 2019 03:53 IST|Sakshi

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఆరోపణ

సాక్షి, హైదరాబాద్‌: తన మొండి వైఖరితో సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులను వేధిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తాము అండగా ఉంటామని, ఆర్టీసీ కార్మికుల పక్షాన కాంగ్రెస్‌ నిలుస్తుందని చెప్పారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం మొండివైఖరితో సాగడం మంచిది కాదన్నారు.

వెంటనే సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్, శ్రీనివాసరావులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దిశలో పయనిస్తున్న తీరును పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ (పీపీపీ) ద్వారా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు వివరించారు. ఈ సమావేశంలో దాసోజు శ్రావణ్, ఆర్‌.సి.కుంతియా, జానారెడ్డి, భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొడెం వీరయ్య, పార్టీ నేతలు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 

ప్రకృతి చికిత్సకు ఉత్తమ్‌ 
ఉత్తమ్‌ ప్రకృతి చికిత్స తీసుకునేందుకు బెంగళూరుకు వెళ్లారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు జిందాల్‌ నేచుర్‌కేర్‌ సెంటర్‌లో బసచేసి చికిత్స పొందుతారు. గత డిసెంబర్‌ నుంచి వరుసగా వస్తున్న ఎన్నికలతో కలిగిన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ఆయన చికిత్సకు వెళ్తున్నారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శివసేనకు కాంగ్రెస్‌ మద్దతు!

‘ఆయన తిన్నది అరక్క దీక్ష చేస్తున్నారు’

‘ఆ విషయంలో కేసీఆర్‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డు’

‘వల్లభనేని వంశీకి బీజేపీ ఆహ్వానం’

దీపావళి నాడే ఆ దేశ వస్తువులు వాడొద్దంటారు కానీ..

‘వైఎస్‌ జగన్‌ మాటిస్తే.. గుర్తు చేయాల్సిన పనిలేదు’

పవన్‌ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి: అవంతి

‘పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అట్రాసిటీ కేసు పెడతా’

డౌటే లేదు.. నేనే సీఎం: ఫడ్నవిస్‌

శివసేన ఎంపీ సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుకు ఎమ్మెల్యే వంశీ వాట్సప్‌ లేఖ

‘సీఎం అబద్ధాలు చెప్పారు’

హరియాణా సీఎంగా ఖట్టర్‌ ప్రమాణం

బీజేపీ, శివసేన మధ్య ‘50:50’పై పీటముడి

‘టీడీపీ అధ్యక్షుడిగా బాబు ఉంటారో ఉండరో’

‘గంటాను చంద్రబాబు అప్పుడే బెదిరించారట’

స్వరం మార్చిన శివసేన!

‘రాత్రి వరకు ఆరోగ్యం బాగానే ఉంది.. కావాలనే’

ఆయనకు మ్యాన్షన్‌ హౌస్‌ గురించి బాగా తెలుసు!

బీజేపీకి చుక్కలు చూపిస్తున్న శివసేన

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా

థాక్రే చేతిలోనే రిమోట్‌ కంట్రోల్‌.. సీఎం పదవిని పంచాల్సిందే!

సీఎంగా ఖట్టర్‌.. డిప్యూటీ సీఎం దుష్యంత్‌..

పండగ వేళ విషాదం.. బీజేపీ సీనియర్‌ నేత మృతి

చిన్నమ్మను బయటకు తీసుకొస్తాం 

18 కిలోమీటర్ల సాష్టాంగ నమస్కారాలు

ఇసుక కొరతపై ఆందోళన వద్దు 

రాసిస్తేనే మద్దతిస్తాం..

సీఎం ఖట్టర్‌.. డిప్యూటీ దుష్యంత్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...

రణస్థలం హిట్‌ అవ్వాలి – పూరి జగన్నాథ్‌

దేవరకొండ ప్రేమకథ