కేటీఆర్‌ ప్రమాణం చేస్తావా?

29 Apr, 2019 17:37 IST|Sakshi
వీ హనుమంతరావు(పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వీ హనుమంతరావు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరీనా ఐటీ కంపెనీ తనకు తెలియదని కేటీఆర్‌ చెప్పడం అబద్ధమని తెలిపారు. గ్లోబరీనా కంపెనీ తెలియదని అమ్మవారి మీద ప్రమాణం చేస్తావా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు.

కేటీఆర్‌ రేపు ఉదయం 12 గంటలకు పెద్దమ్మ గుడి వద్దకు రావాలని అన్నారు. ఆయన పెద్దమ్మ గుడి దగ్గరకు రాకపోతే గ్లోబరీనా ఐటీ కంపెనీతో ఆయనకు సంబంధం ఉన్న మాట నిజమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు ఐటీ కంపెనీ గురించి తెలియదా అని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు