నాలుగేళ్ల పాలనలో కేసీఆర్‌ విఫలం: వీహెచ్‌

28 May, 2018 02:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గత నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని రకాలుగా విఫలమయ్యారని, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల మంజూరు, పేదలకు భూ పంపిణీలాంటి పథకాలను అమలు చేయలేకపోయారని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు విమర్శించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ఏడాదిలో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం వల్ల భూస్వాములకే లబ్ధి కలుగుతోంది తప్ప సామాన్య రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. 23 వేల మంది కాంట్రాక్టు విద్యుత్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయలేదని, ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే ఇప్పుడు ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. తమ సొంత సామాజిక వర్గానికి ఆర్టీసీని అప్పగించేందుకు కేసీఆర్‌ ప్రయత్ని స్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేలా కార్యచరణ రూపొందిస్తున్నామని వీహెచ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు