మోదీ ‘శునక’ వ్యాఖ్యలు.. ఆజాద్‌ పొగడ్తలు

7 May, 2018 10:11 IST|Sakshi

శివమొగ్గ: రసవత్తరంగా సాగుతోన్న కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నేతలు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఒకదిక్కు ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్‌పై, సోనియా, రాహుల్‌ గాంధీలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పిస్తే... ఇందుకు భిన్నంగా కాంగ్రెస్‌ నేతలు మాత్రం బీజేపీ మాజీలను పొడగ్తలతో ముంచెత్తారు. నాటి నేతలతో పోల్చుతూ నేటి మోదీ దేశంపై విషం చిమ్ముతున్న తీరును వివరించారు. ఆదివారం శివమొగ్గలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌ రాజ్యసభలో కాంగ్రెస్‌ పక్ష గులాం నబీ ఆజాద్‌.. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయిని ఆకాశానికెత్తేశారు.

‘‘వాజపేయి పాలనలో విద్వేషపు దాడులుగానీ, దళితులపై అకృత్యాలుగానీ లేకుండేవి. అందరి కిచెన్‌లలోకి చొరబడటంగానీ, తినే ఆహారంపై దాడులు చేయడంగానీ జరిగేవికావు. నిజంగా ఆ రోజులే వేరు. కానీ ఇప్పటి ప్రధాని అలా కాదు. విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు’’ అని ఆజాద్‌ పేర్కొన్నారు. ఆదివారం హుబ్లీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ప్రధాని మోదీ.. భారతీయ సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటకకు చెందిన ముధోల్‌ శునకాల నుంచైనా కాంగ్రెస్‌ పార్టీ దేశభక్తి నేర్చుకోవాలంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి: ఆ శునకాల నుంచైనా నేర్చుకోండి!)

మరిన్ని వార్తలు