టీడీపీకి వంటేరు ప్రతాప్‌రెడ్డి గుడ్‌బై

13 May, 2018 03:59 IST|Sakshi
వంటేరు ప్రతాప్‌రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, గజ్వేల్‌: టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు, గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేశారు. శనివారం పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రతాప్‌రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాజీనామా పత్రంపై సంతకం చేసి.. పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ప్రతాప్‌రెడ్డి 2009 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డిపై, 2014 ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం టీడీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. మల్లన్నసాగర్‌ బాధితులకు అండగా పోరాటం, ఓయూలో విద్యార్థి మురళి ఆత్మహత్యకు పాల్పడిన సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సందర్భంలో ప్రభుత్వం తనపై కక్ష గట్టి అక్రమ కేసులతో జైలుకు పంపిందని, అయితే ఈ పోరాటాల్లో టీడీపీ తెలంగాణ నాయకత్వం తనకు అండగా నిలవకపోవడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  మరో వారంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు ప్రతాప్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?

సీపీఐ కొత్త సారథి డి.రాజా

నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

హస్తిన హ్యాట్రిక్‌ విజేత

ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు

'ప్రపంచబ్యాంకు వెనుదిరగడం చంద్రబాబు పుణ్యమే'

కార్యకర్త నుంచి కడవరకూ కాంగ్రెస్‌లోనే

ఎగిరే పార్టీకాదు.. నిలదొక్కుకునే పార్టీ..

‘ఇప్పుడు వెళ్తున్నా.. త్వరలోనే మళ్లీ వస్తా’

రాజకీయాలు చేసేందుకే ప్రియాంక అక్కడకు..

‘ఎవరిని అడిగినా చెప్తారు.. తుగ్లక్‌ ఎవరో’

గెస్ట్‌హౌస్‌లో ప్రియాంక.. కరెంట్‌, వాటర్‌ కట్‌!

ఆజం ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు

ఉన్న పరువు కాస్తా పాయే..!

ఆయన డెస్క్‌ మీద.. తలకిందులుగా జాతీయ జెండా!

మున్సిపల్‌ చట్టం.. బీసీలకు నష్టం

కమలంలో కలహాలు...

ప్రియాంక గాంధీ అరెస్ట్‌!

గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి

పోలవరం పూర్తి చేసే సత్తా మాకే ఉంది

పాతవాటికే పైసా ఇవ్వలేదు.. కొత్తవాటికి ఏమిస్తారు?

మీ మైండ్‌సెట్‌ మారదా?

సంచలన ఎంపీపై పరువునష్టం దావా

ప్రియాంక గాంధీ అయితే ఓకే..

కర్ణాటక అసెంబ్లీ సోమవారానికి వాయిదా

కండీషన్స్‌ లేకుండా బీజేపీలో చేరుతా..

పార్లమెంట్‌ సమావేశాలు మూడు రోజులు పొడగింపు!

కర్ణాటకం : విశ్వాస పరీక్షకు మరో డెడ్‌లైన్‌

చిరంజీవి మమ్మల్ని సంప్రదించలేదు..

ప్రియాంక గాంధీని అడ్డుకున్న అధికారులు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి