అందుకే మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వచ్చా: వరుపుల

18 Mar, 2019 16:50 IST|Sakshi

సాక్షి, కాకినాడ: తన తోడల్లుడు జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇస్తారని చెబితే టీడీపీలో చేరానని తూర్పుగోదావరి జిల్లా  ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వెల్లడించారు. సోమవారం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తనకు చంద్రబాబు చేసిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు వైఎస్ఆర్, గత ఎన్నికల్లో ఆయన తనయుడు వైఎస్ జగన్ తనను గుర్తించి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని.. వారి వల్లే రెండు సార్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. అలాంటి వ్యక్తుల గుర్తింపు మరిచిపోయి పార్టీ ఫిరాయించి పొరపాటు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

మనవడే కదా అని వరుపుల రాజాను తన వెంట తిప్పుకుని స్వేచ్ఛ ఇస్తే తాతకే వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నాడని వాపోయారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని టీడీపీ అధిష్టానం చెప్పినా తిరస్కరించి మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వచ్చినట్టు వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో తనకు ఎటువంటి పదవులు వద్దని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీలో కష్టపడి పనిచేస్తాని వరుపుల సుబ్బారావు అన్నారు.

మరిన్ని వార్తలు