ఆడియో, వీడియో సాక్షిగా అయ్యన్న దొరికారు

21 Jun, 2020 03:55 IST|Sakshi

కమిషనర్‌ను అవమానించిన ఆయన్ను అరెస్ట్‌ చేయిస్తాం

ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నారు

మహిళా ఉద్యోగులంటే టీడీపీకి అంత చులకనా?

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ధ్వజం

సాక్షి, అమరావతి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యముంటే అయ్యన్నని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు. నిర్భయ చట్టం కింద అయ్యన్నపై కేసు నమోదైతే ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..

► విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ తోట కృష్ణవేణితో అయ్యన్న అవమానకరంగా మాట్లాడారు. ఆడియో, వీడియో సాక్షిగా దొరికారు.
► అలాంటి వ్యక్తిపై నిర్భయ చట్టం కింద కేసు పెడితే వెనుకేసుకొస్తారా?
► మహిళా ఉద్యోగులంటే టీడీపీకి అంత చులకనా? మహిళా అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే మిగతా మహిళలు ఎలా పని చేస్తారు?
► మా వాళ్లపై రాజకీయ దురుద్దేశంతో కేసులు పెడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్‌ వద్దకు నిస్సిగ్గుగా వెళ్లారు.
► మరమ్మతు పనులు పూర్తయ్యాక అనకాపల్లి మున్సిపల్‌ కార్యాలయం గోడపై అయ్యన్న పాత్రుడు తాతగారి ఫొటో యథాస్థానంలో పెడతామని కమిషనర్‌ చెప్పినా, అయ్యన్న బహిరంగంగా బూతులు తిట్టారు.
► మహిళా కమిషన్‌ ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఆయ్యన్నను అరెస్టు చేయిస్తాం.
► రాజకీయ మదంతో ఎవరైనా మాట్లాడితే ఇలానే కేసులు ఉంటాయి.
► బాధితులకు అండగా ఉంటాం. ఎవరు ఏ సమయంలో ఫోన్‌ చేసినా అందుబాటులో ఉంటాం.

మరిన్ని వార్తలు