‘చం‍ద్రబాబు హైదరాబాదు వాసి.. పవన్‌ అజ్ఞాతవాసి’

18 Apr, 2020 09:42 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మ్మోహన్‌రెడ్డి అని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. కృష్ణానది వద్ద ఉన్న పేద బ్రాహ్మణులకు మంత్రి నిత్యవసర వస్తువులు, కూరగాయలు శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం ప్రజలెవరూ ఆకలి బాధతో ఉండకూడదని లక్షమందికి పైగా నిత్వవసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశామన్నారు. గ్రామ వాలంటీర్లు మీడియా సిబ్బంది ఇతర వర్గాలకు కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడం చేయకుండా ప్రభుత్వంపై విమర్శలు చేసే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ వాసి అని, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అజ్ఞాతవాసని మంత్రి విమర్శించారు. (సీఎం సహాయనిధికి విరాళాలు)

చంద్రబాబు పరాయి రాష్ట్రంలో ఉంటూ.. స్వలాభం కోసం చేసే నీచ విమర్శలు చేయడం మానుకోవాలని మంత్రి మండిపడ్డారు. పనికిమాలిన రాజకీయాలు చేసే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కన్నా లక్ష్మీనారాయణ, పేమెంట్‌లు తీసుకునే రామకృష్ణలు సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో పవర్‌ స్టార్‌ కావచ్చు ప్రజల్లో మాత్రం ఫెయిల్యూర్‌ స్టారే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణ కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇక 10 నిమిషాల్లో కరోనా టెస్ట్‌ నిర్వహించే లక్ష ర్యాపిడ్‌ కిట్లు ప్రభుత్వం తీసుకువచ్చిందని, కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. (పురోహితులను ఆదుకోండి)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు