‘బాబు.. ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’

27 Feb, 2020 18:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు తన రాజకీయా డ్రామాలు కట్టిపెట్టాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను చంద్రబాబు పరిగణలోకి తీసుకోవాలన్నారు. చంద్రబాబును వెంటనే విశాఖపట్నం నుంచి వెనక్కి పంపించాలన్నారు. వైజాగ్‌ను చంద్రబాబు పరిపాలన రాజధానిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సూటిగా ప్రశ్నించారు. (ఉత్తరాంధ్రపై దండయాత్రకు అమరావతి రాజుగారు..)

అదేవిధంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైజాగ్‌లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు అక్కడికి వెళ్లారని మండిపడ్డారు. పథకం ప్రకారం శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వైజాగ్‌లో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు వైజాగ్ ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారన్నారు. (చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే)

ఐదు గంటలపాటు వైజాగ్‌లో చంద్రబాబు హైడ్రామా నడిపారని ఎమ్మెల్యే మల్లాది విష్టు మండపడ్డారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న చంద్రబాబు.. ఉత్తరాంధ్రలో పర్యటించే ముందు అక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాలని విష్ణు డిమాండ్‌ చేశారు. చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియా చేస్తున్న హడావుడి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏం సాధిద్దామని చంద్రబాబు వైజాగ్ వెళ్లారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రయత్నిస్తే  ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన మండిపడ్డారు. ( తమాషా చేస్తున్నారా.. చంద్రబాబు బెదిరింపులు)

మరిన్ని వార్తలు