తెలంగాణ టీడీపీకి మరో షాక్‌

29 Oct, 2017 11:32 IST|Sakshi

తెలంగాణ టీడీపీకి వేం నరేందర్‌ రెడ్డి రాజీనామా

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మారో షాక్‌ తగిలింది. ఇప్పటికే పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయగా, తాజాగా ఆయన బాటలోనే మరోనేత అనుసరిస్తున్నారు. టీడీపీ నేత వేం నరేందర్‌ రెడ్డి ఆదివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపించారు. కాగా తానూ ఎన్టీఆర్‌ పిలుపుమేరకే రాజకీయాల్లోకి వచ్చానని వేం నరేందర్‌ రెడ్డి తెలిపారు. జీవితమే తెలుగుదేశం పార్టీగా పని చేశానని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో నాయకత్వం లోటు కనిపిస్తోందన్నారు. తెలంగాణలో దుర్మార్గపు పాలన సాగుతోందని వేం నరేందర్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

ఇక ఇప్పటికే రేవంత్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో తెలంగాణ టీడీపీలో అలజడి రేపుతోంది. దీంతో రేవంత్‌రెడ్డి వెంట నడిచేందుకు మరికొందరు టీటీడీపీ నాయకులు కూడా  హస్తం గూటికి చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు