నిలకడగా అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం..

10 Aug, 2019 08:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  తీవ్ర అస్వస్థతకు గురై ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్‌ జైట్లీని శనివారం ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ‍్య నాయుడు పరామర్శించారు. ఇవాళ ఉదయం ఎయిమ్స్‌కు వెళ్లిన ఆయన ...జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. చికిత్సకు అరుణ్‌ జైట్లీ శరీరం స్పందిస్తోందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే జైట్లీ కుటుంబసభ్యులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి సెక్రటేరియెట్‌ కార్యాలయం ట్వీట్‌ చేసింది.

కాగా జైట్లీ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఆయనను ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో చేరారు. వెంటనే ఐసీయూలో చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. గతేడాది మే నెలలో జైట్లీకి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఎంతోకాలంగా ఆయన షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగానే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ జైట్లీ పోటీ చేయలేదు. 

చదవండి: అరుణ్‌ జైట్లీకి తీవ్ర అస్వస్థత

>
మరిన్ని వార్తలు