ఫలితాల సరళిపై మమతా బెనర్జీ ఏమన్నారు?

11 Dec, 2018 12:16 IST|Sakshi

ఫలితాల సరళిపై -మమతా బెనర్జీ

అన్ని రాష్ట్రాల్లో బీజేపీని తిప్పి కొట్టిన  ప్రజలు

'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' డెమాక్రసీ

సాక్షి, కోలకతా: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిపై  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి  మమతాబెనర్జీ స్పందించారు.  2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న  తాజా  ఫలితాలు బీజేపీకి పెద్ద  షాక్‌ అంటూ తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు.  ఓట్ల లెక్కింపు  కొనసాగుతున్నతరుణంలో ఆమె వరుస ట్వీట్లతో బీజేపీపై చురకలంటించారు. ఇది ప్రజల తీర్పు .. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశ  ప్రజల విజయమని ట్వీట్‌ చేశారు.  ఈ సందర‍్భంగా  విజేతలకు  అభినందనలు  తెలిపారు.

బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఇది ప్రజాస్వామ్య విజయం. అన్యాయానికి,  అమానుషానికి,  ఏజన్సీల దుర్వినియోగం, పేద ప్రజలు, రైతులు, యువత, దళితులు, ఎస్సీ, ఎస్టీ, ఒబిసి, మైనారిటీలపై దాడులు, విచ్ఛిన్నానికి వ్యతిరేకంగా  దేశ ప్రజలు సాధించిన విజయమని మమత పేర్కొన్నారు.  అన్ని రాష్ట్రాల్లో  బీజేపీకి చోటు లేదని సెమీఫైనల్ రుజువు  చేసిందన్నారు. 2019 ఫైనల్ మ్యాచ్‌కు ఇది నిజమైన ప్రజాస్వామిక సూచన. చివరకు, 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' డెమాక్రసీ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు