‘కాబోయే కర్ణాటక ముఖ్యమంత్రి ఆయనే’

10 May, 2018 16:37 IST|Sakshi
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా

సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. ఆయన గురువారం బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాదామిలో భారీ రోడ్డు షోలో ప్రసంగించారు. సీఎం చాముండేశ్వరీలో ఎప్పుడో ఓడిపోతాననే భయంతో బాదామిలో పోటీ చేశారు. చాముండేశ్వరీలోనే కాదు, బాదామిలో బీజేపీ రోడ్డు షోకు పెద్ద సంఖ్యలో జనం వచ్చిన తీరు చూస్తుంటే అక్కడ,ఇక్కడ రెండింటిలోను సీఎం సిద్ధరామయ్యకు ఓటమి తథ్యం అని  అమిత్‌షా జోస్యం చెప్పారు.

రెండు నియోజకవర్గాల్లో సీఎం ఓటమి చెందడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్‌పార్టీని జనం తిరస్కరిచండంతో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందన్నారు. తాను నెల రోజులుపైగా కర్ణాటకలో అన్ని జిల్లాలో పర్యటించానని ప్రతి జిల్లాలో మంచి బీజేపీకి జనం నీరాజాలు పలికారని, చివరి రోజు సీఎం పోటీ చేస్తున్న బాదామి రోడ్డు షోలో పాల్గొంటే ఇక్కడ జనం చేస్తుంటే సీఎం ఓటమి ఖాయమని తేలిపోయింది,తమ పార్టీ అభ్యర్థి శ్రీరాములు భారీ మెజార్టీతో గెలుపొందుతారనే విశ్వాసం ఏర్పడిందన్నారు.

సీఎం సిద్ధరామయ్య మరో నాలుగు రోజులు మాత్రమే సీఎం కుర్చీలో ఉంటారని,ఆ తర్వాత తమ పార్టీ నేత, యాడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు. యడ్యూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేంద్రం నుంచి కర్ణాటకకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని,దేశంలోనే కర్ణాటకను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లుతామన్నారు. అవినీతి కూపంలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీకి జనం బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ సీఎంలు యడ్యూరప్ప, జగదీష్‌శెట్టర్, బీజేపీ అభ్యర్థి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం అమిత్‌ షా బెంగుళూరులో విలేకరులతో మాట్లాడుతూ..స్వాతంత్ర్య భారతదేశంలో అత్యంత ఘోరంగా విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఘాటుగా విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు కర్ణాటకలోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలను తగ్గించిందని పేర్కొన్నారు. కానీ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను నిలువరించడంలో విఫలమైందన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని చెప్పారు. కర్ణాటక అభివృద్ధి, రాజధాని బెంగుళూరుపై ఆధారపడి ఉందని, కానీ బెంగుళూరుకు సిద్ధరామయ్య సర్కార్‌ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు