చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ కూడా జైలుకే..

6 Apr, 2019 18:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో 650కి పైగా హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు 36 పేజీల టీడీపీ మ్యానిఫెస్టోను విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామని, అధికారం పోతుందనే భయంతో చంద్రబాబు నాయుడు, టీడీపీ పార్టీ ఫ్రస్ట్రేషన్‌లో ఉందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోయేలా మ్యానిఫెస్టోను విడుదల చేశారని, రాజన్న రాజ్యం మళ్లీ ప్రజలకు అందేలా ఈ మ‍్యానిఫెస్టో ఉందన్నారు.

విజయసాయి రెడ్డి శనివారమిక్కడ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘ఇటీవల విశాఖలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు నాకు అండగా ఉండాలి. లేకపోతే నేను జైలుకు వెళ్లే అవకాశం ఉందనే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. చంద్రబాబు మాత్రమే కాదు... గత అయిదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి సహకరించిన వారందరూ...ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా జైలుకు వెళతారు. విశాఖలో ఓ గర్భిణిపై వైఎస్సార్ సీపీ నేతలు దాడి చేశారని చంద్రబాబుతో పాటు ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలు ప్రచురిస్తున్నారు. అయితే విశాఖ పోలీసులు కూడా మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినా, చంద్రబాబు మాత్రం ఇంకా మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక లోక్‌నీతి సర్వే అంటూ బోగస్ ప్రచారం చేశారు. చివరికి లోక్‌నీతి సంస్థ కూడా ఆ సర్వే మాది కాదని ఖండించింది. దీంతో చంద్రబాబు, రాధాకృష్ణ మొహం మీద ఉమ్మినట్లు అయింది. 

ఈ నాలుగున్నరేళ్లలో ఇంచుమించు రాధాకృష్ణ.. ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనలతో పాటు వివిధ రూపాల్లో రూ.1500 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరో 1500 కోట్లకు సెటిల్‌మెంట్లు చేశారు. పత్రికాముఖంగా చెబుతున్నా. చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ కూడా జైలుకు వెళతాడు.  ఈరోజు.. ఆంధ్రజ్యోతిలో నేను మా పార్టీ అధ్యక్షుడిని కించపరిచేలా మాట్లాడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తూ ప్రోగ్రామ్‌ టెలీకాస్ట్‌ చేసింది. ఆంధ్రజ్యోతి.. ఒక కులజ్యోతి పత్రిక మాత్రమే. ఓ సామాజిక వర్గానికి కొమ్ము కాస్తోంది. గతంలో రాధాకృష్ణ  కిరోసిన్‌, రేషన్‌ బియ్యం దొంగ. ఒక దొంగకు ఇంతకన్నా మంచి ఆలోచనలు, ఐడియాలు వస్తాయా?.  మానవతా విలువలు విడిచి...దుష్ప్రచారం చేస్తూ  సమాజంలో మాట్లాడకూడనివి కూడా అసభ్యకరంగా ప్రసారం చేస్తున్నారు. వీటన్నింటిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. అంతేకాదు చట్టపరంగా కూడా ముందుకు వెళతా. 

రాధాకృష్ణ నిజమైన జర్నలిస్టు అయితే...నీ ఛానల్‌ టెలికాస్ట్‌లో ...వాయిస్‌ను నాదని నిరూపించు. నా వాయిస్‌ అందరికీ తెలుసు. కొంతమంది సామాన్య జనానికి తెలియకపోవచ్చనే ఉద్దేశంతో టీడీపీ ప్రయోజనాల కోసం పాకులాడుతోంది. నిన్న లక్ష్మీపార్వతి, ఈరోజు నా మీద, రేపు ఇంకొకరిపై ఇలాంటి అసత్య ప్రచారాలే చేస్తాడు. రాధాకృష్ణ జాతీయ నాయకుడివా? లేక దేశభక్తుడివా? కాదు...కాదు.. కాదు అని నేను స్పష్టంగా చెప్పగలను. సమాజానికి చీడ పురుగువి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తివి కావు. గతంలో మందకృష్ణ మాదిగను బాడుగ నేతగా నువ్వు అభివర్ణించావు. ఇప్పుడు నువ్వు కాదా బాడుగ నేతవి. నువ్వు తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయావు. చంద్రబాబుతో కలిసి నువ్వు దోచుకున్న రాష్ట్ర సొమ్మును పైసాతో సహా కక్కిస‍్తాం. నీపై ఈసీకి, ఇన్‌ఫర్మేషన్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌కు ఫిర్యాదు చేస్తాం. ఆడియోలో ఆ వాయిస్‌ ఎవరిదన్నది...సీఎఫ్‌ఎల్‌సీకి నిర్థారణ చేసిన తర్వాతే అసలు విషయం తెలుస్తోంది. గతంలో ఓటుకు నోటుకు కేసులో ఉన్న వాయిస్‌ చంద్రబాబుదేనని స్పష్టం అయింది. మీరు ప్రసారం చేసినట్లుగా సన్నాయి నొక్కులు, దుర్యోధనుడు, దృతరాష్ట్రుడు, అనే పదాలు కూడా నాకు ఇంతవరకు తెలియదు ఇప్పుడే అడిగి తెలుసుకున్నా.’  అని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?