'ఆస్తుల ధర పడిపోకుండా అడ్డం నిల్చోవాలట'

13 Jan, 2020 10:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఒకలా మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

'రాజధాని ప్రాంతంలో జరుగుతోన్న పరిణామాలకు నిరసనగా తన కుటుంబం ఈ సారి సంక్రాంతి పండుగ చేసుకోదని గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండగను సొంత ఊళ్లలో జరుపునే సంప్రదాయం తమ కుటుంబంతోనే మొదలైందని అప్పట్లో ప్రవచించాడు. ఇన్ సైడర్ కిరికిరిలో దొరికిపోయి ఈసారి పండగ బహిష్కరిస్తున్నాడట. ప్రజలు కూడా తనను అనుసరించాలనేది ఆయన ఆకాంక్ష. గ్రామాల్లో మాత్రం ఎన్నడూ లేనంత సంక్రాంతి శోభ కనిపిస్తోందని' విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

చదవండి: ‘చంద్రబాబు రాష్ట్రంలో​ పుట్టడం దురదృష్టకరం’

మరో ట్వీట్‌లో సచివాలయం ఉద్యోగులు సంక్రాంతి సెలవులు తీసుకోకుండా విధుల్లోకి రావాలని చంద్రబాబు పిలుపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. 'చంద్రబాబు లాంటి అవకాశవాది ఎక్కడా కనిపించడు. తన స్వార్థం కోసం, బినామీల కోసం అందరూ వీధుల్లోకి రావాలట. నేను పోరాటం చేస్తుంటే విద్యార్థులు ఇళ్లలో కూర్చుంటారా అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడేమో ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఆస్తుల ధర పడిపోకుండా అంతా అడ్డం నిల్చోవాలట' అంటూ ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు