ఇంట్లో కూర్చుని ట్విటర్‌లో ఆవేశపడితే ఎలా?

4 May, 2020 15:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  చంద్రబాబు, లోకేష్‌ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ఆయన ట్విటర్‌ వేదికగా తిప్పికొట్టారు. ‘ఈ వయసులో చంద్రబాబు రాకున్నా కనీసం లోకేశ్ నాయుడైనా తమ పార్టీ తరపున సేవా కార్యక్రమాలు చేపట్టాలి. మంత్రిగా పదవి అనుభవించిన వ్యక్తి  ఇంట్లో కూర్చుని ట్విటర్లో  ఆవేశపడితే ఎలా? కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరిన వారితో మాట్లాడాలి. తండ్రి చాటున దాక్కుని రాళ్లు విసరడం కాదు’  అంటూ మండిపడ్డారు. (మై డియర్ పప్పూ అండ్ తుప్పూ!)

‘టీడీపీ, దాని బానిసలకు లాక్‌డౌన్ తో మతి భ్రమించినట్టుంది. కరోనా కిట్ల ధరలపై అరిచి భంగపడ్డారు. కిట్ల తయారీ కంపెనీలో వాటాలున్నాయని, డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకున్నారని మంటలు రాజేస్తున్నారు. రివర్స్ టెండర్లతో 2 వేల కోట్ల ప్రజాధనం ఆదాచేసిన సిఎం ఉన్నారిక్కడ. నోరు పారేసుకోవద్దు’  అని హితవు పలికారు.

నెలలో మూడుసార్లు ఫ్రీ రేషన్ ఇస్తే, ఇంకా అన్న క్యాంటీన్లు తెరవాలని రాద్దాంతం చేస్తున్నారు. అది 100 కోట్ల స్కామ్. క్యాంటీన్ల పేరుతో నిర్మించిన షెడ్లలో ఎవరెంత దోచుకున్నది త్వరలోనే బయటపడుతుంది. పేదల భోజనంలో కూడా కక్కుర్తి పడ్డ బతుకులు కాదా మీవి? అంటూ విమర్శలు గుప్పించారు. (నాకు రిప్లై ఇచ్చారహో..’)

మరిన్ని వార్తలు