'ఆ విషయంలో బాబు సలహాదారు చిట్టినాయుడే'

11 Jan, 2020 12:05 IST|Sakshi

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమరావతి రాజధాని విషయంలో తండ్రి, కొడుకులు అవలంభిస్తున్న తీరును తప్పుబట్టారు. ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమానికి నిధులు సేకరించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా జోలెపట్టి ప్రజల నుంచి విరాళాలు సేకరించిన విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ 'చంద్రబాబు నాయుడి ముఖ్య సలహాదారు చిట్టి నాయుడే అయి ఉంటాడని అనుకుంటున్నారంతా. గాజులు, ఉంగరాల సేకరణ నుంచి జోలె పట్టుకునే దాకా రాజు గారి దేవతా వస్త్రాల కథ గుర్తుకొస్తోంది. తుపాన్లతో వేల కోట్ల నష్టం వాటిల్లినప్పుడు సైతం చేతులు చాపని వ్యక్తి ఇంతగా రగిలి పోవడం అలాగే అనిపించట్లేదూ?' అంటూ ట్విటర్‌ వేదకగా విజయసాయిరెడ్డి విమర్శించారు. 

చదవండి: 'చిన్నబాబుకు నమ్మకస్తుడిగా కోట్లకు పడగలు'

కాగా మరో ట్వీట్‌లో.. 'చంద్రబాబు నాయుడి స్వభావం మొదటి నుంచి అంతే. ప్రజా ధనాన్ని తన సొత్తు అన్నట్టుగా అడ్డగోలుగా లూటీ చేస్తాడు. అడ్డం తన్నగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తాడు. ఎల్లో మీడియా మోత మోగించే రోజుల్లో అయితే ఆడింది ఆటగా సాగేది? సోషల్ మీడియా సూర్యుడు పొడిచాక చీకటి చుక్కలు అదృశ్యమయ్యాయి' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చదవండి: నీకెందుకు డబ్బులు వేయాలి?

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీఎంతో నూతన సీఎం తొలిసారి భేటీ

‘అందుకోసమే చంద్రబాబు డ్రామాలు’

'చంద్రబాబు.. రాయయలసీమ ద్రోహి'

పవన్‌తో అలాంటివేం ఉండవు : జనసేన ఎమ్మెల్యే

సత్తెనపల్లిలో టీడీపీకి షాక్‌!

సినిమా

ప్రభాస్‌ కొత్త సినిమా ‘జాన్‌’ కాదా?

సుకుమార్‌ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

అవునా.. కేర్‌టేకర్‌కు అంత జీతమా?!

మరోసారి పెళ్లికి రెడీ అయిన హీరో!

సరిలేరు నీకెవ్వరు : మూవీ రివ్యూ

దుమ్ము దులుపుతున్న ‘దర్బార్‌’