‘ఈడ్చి కొడితే ఎక్కడో పడ్డ చంద్రబాబు..’

3 Sep, 2019 12:12 IST|Sakshi

పవన్‌, చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు

సాక్షి, అమరావతి : ప్రజల అఖండ మద్దతుతో అధికారంలోకొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై ఓ పక్క పచ్చ పార్టీ నేతలు, మరోపక్క తోక పార్టీ జనసేన నేతలు పసలేని విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారు. గెలుపు కోసం ఎంతో కృషి చేసినా.. ఎందుకు ఓడిపోయామో తెలియదంటూ చంద్రబాబు, ఎన్నికల్లో అక్రమాల వల్లే వైఎస్సార్‌సీపీ గెలిచిందని పవన్‌ ఇటీవల అడ్డగోలుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు.

‘యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారు. ఆయనేమో ఎందుకు ఓడిపోయానో తెలియదంటాడు. రెండు చోట్ల అడ్రసు గల్లంతైన పార్టనరేమో కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే గెలిచారంటారు. మరి టీడీపీ గెలిచిన ఆ 23 సీట్లలో ఆయనను, ఒక్క స్థానంలో పార్ట్‌నర్‌ను ఎవరు గెలిపించారో? అని విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.
 
ఈడ్చి కొడితే ఎక్కడో పడ్డారు..
పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ భారత్‌కు చేస్తున్న హెచ్చరికల మాదిరిగానే చంద్రబాబు కూడా ఊరికే పేలుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలు ఈడ్చి కొడితే ఎక్కడో పడిన చంద్రబాబు నాయుడి వార్నింగులు ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యల్లానే ఉంటున్నాయని చురకలంటించారు. ‘మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నింటిలో విఫలమయ్యారంట. అర్జంటుగా కుర్చీ ఖాళీ చేయాలని బాబుగారు గగ్గోలు పెడుతున్నాడు’అని ఎద్దేవా చేశారు. ‘ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే టీడీపీ జతకట్టని పార్టీ, ఫ్రంటూ దేశంలో లేదు. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని కానేకాడని జోస్యాలు చెప్పిన సిగ్గు లేని పచ్చ పార్టీ ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది. మనుగడ కోసం ఎవరి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనేదే నారా చంద్రబాబు గారి ఫిలాసఫీ’ అని ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు భ్రమే!

పయ్యావుల వర్గీయుల రౌడీయిజం..

మోదీకి మిలిందా గేట్స్ ఫౌండేషన్ అవార్డు

టీడీపీ నేతల వ్యాఖ్యలు.. దళిత ఎమ్మెల్యే కంటతడి

చిదంబరానికి స్వల్ప ఊరట

అక్కడికి వెళ్తే సీఎం పదవి కట్‌?!

గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాటం చేయాలి

‘నాతో పెట్టుకుంటే విశాఖలో తిరగలేవ్‌..’

కేసీఆర్‌వి ఒట్టిమాటలే

2024లో టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పోటీ

గవర్నర్‌ మార్పు వెనుక ఆంతర్యం అదేనా?

మేం తలుపులు తెరిస్తే మీ పార్టీలు ఖాళీ

మాట తప్పిన పవన్‌ కల్యాణ్‌ : ఎమ్మెల్యే ఆర్కే

ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎగ్గొట్టి పరిహారంపై లేఖలా?

వైఎస్సార్‌ సీపీలోకి  భారీ చేరికలు

విశాఖలో టీడీపీకి షాక్‌

బీజేపీ స్వయంకృతం

ఒక్క రాజధానిలో వెయ్యి కుంభకోణాలు

రీడిజైన్ల పేరుతో కమీషన్లు ! 

‘కేసీఆర్‌ ఎలా పుట్టారో మేము అలానే పుట్టాం’

అదే బీజేపీ నినాదం : కిషన్‌రెడ్డి

ఒక్క రాజధాని.. వెయ్యి కుంభకోణాలు: బొత్స

‘టీఆర్‌ఎస్‌లో ఓనర్షిప్‌ల కొట్లాట మొదలైంది’

గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్‌

సేమ్‌ టు సేమ్‌; బాబులా తయారైన పవన్‌ కల్యాణ్‌

విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్‌..!

బీహార్‌ మాజీ సీఎంకు అనారోగ్యం

కేసీఆర్‌ పని అయిపోయింది: కోమటిరెడ్డి 

ప్రగతి భవన్‌ నుంచి బయటకు రా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేశా: జబర్దస్త్‌ ఫేం అభి

రాజుగారి గది 3 ఫస్ట్ లుక్‌ లాంచ్‌ చేసిన వినాయక్‌

ద‌స‌రా బ‌రిలో ‘చాణ‌క్య’

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

సాహోపై కేటీఆర్‌ కామెంట్‌

ఆమె ఎవరన్నది కనుక్కోలేక పోతున్నారా!