ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ?

4 Jun, 2019 10:32 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ 50వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు

ట్విటర్‌లో విజయసాయి రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ఆఫీసుల అద్దె చెల్లింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్ల అవినీతికి పాల్పడిందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. సోమవారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అమరావతి, నక్కల రోడ్డులోని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసుకు రూ.5 లక్షల లోపే అద్దె చెల్లించేవారని, దాన్ని రూ.30 లక్షల అద్దె బిల్డింగులోకి షిఫ్ట్‌ చేశారన్నారు. ప్రజల సొమ్ము అంటే ఇంత చులకనా బాబూ? అని ప్రశ్నించారు.

‘రాష్ట్రాన్ని విడగొట్టి కట్టుబట్టలతో తరిమారని ఏడ్చి  పెడబొబ్బలు పెట్టిన వ్యక్తి దుబారా ఖర్చులు చూడండి. ఉన్నత విద్యామండలిలో నలుగురి డ్రైఫూట్స్ ఖర్చు రూ.18 లక్షలంట. విజనరీ, అనువజ్ణుడు, అభివృద్ధి పదగామి అని కుల మీడియా కీర్తించింది ఈయననే.’ అని మండిపడ్డారు.

ఆశా సిస్టర్ల వేతనాన్ని రూ.3 వేల నుంచి ఒకే సారి 10 వేలకు పెంచి సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి 50 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. అక్రిడేటేడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్టు(ఆశా) సోదరీమణులపై చంద్రబాబు ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని, అరెస్టులు చేసి హింసలు పెట్టారని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. కానీ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు వేతనాన్ని పెంచి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు.


 

మరిన్ని వార్తలు