అప్పుడు చేయాల్సిన ‘అతి’ ఇప్పుడేనా బాబూ..!

11 Sep, 2019 15:33 IST|Sakshi

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

సాక్షి, అమరావతి : అవినీతిలో కూరుకుపోయిన పచ్చ నేతల్ని కాపాడుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెగ ఉబలాటపడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు చేయాల్సిన ‘అతి’ని ఇప్పుడే మొదలు పెట్టారని ట్విటర్‌ వేదికగా విమర్శలు చేశారు. ‘యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులున్నాయని రచ్చ చేసి కొత్త పరిశ్రమలు రాకుండా చంద్రబాబు దొంగల ముఠా కుట్రలు మొదలు పెట్టింది. పల్నాడులో ఐదేళ్లు రౌడీయిజం రాజ్యమేలింది. ఇప్పుడక్కడ ప్రశాంతత నెలకొనడం బాబుకు ఇష్టం లేదని అర్థమవుతోంది’అని పేర్కొన్నారు.
(చదవండి : రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు)

‘నిద్ర పట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరిన చందంగా చంద్రబాబు, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం ఉంది. ఎలక్షన్లకు 3 నెలల ముందు చేయాల్సిన ‘అతి’నంతా ఇప్పుడే మొదలు పెట్టారు. చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోయి 100 రోజులే అయింది’అని ట్వీట్‌ చేశారు.

‘చలో ఆత్మకూర్‌’ అందుకేనట..!!
‘ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు చంద్రబాబు, లోకేష్‌ గారూ’ అని విజయసాయిరెడ్డి అన్నారు. 

 ‘దొంగే దొంగని గోల పెట్టడంలా ఉంటాయి చంద్రబాబు గారి వేషాలు. ఐదేళ్లూ అలాగే చేశాడు. అందుకే ప్రజలు గూబ గుయ్ మనిపించి బయటకు విసిరేశారు. మళ్లీ అవే పాత ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నోడు వాళ్ల కోసమే ఛలో ఆత్మకూర్ అంటే నమ్మే అమాయకులుంటారా?’అని ట్వీట్‌ చేశారు.
(చదవండి : మహిళా పోలీసుపై అఖిలప్రియ జులుం)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జమిలి ఎన్నికలు: చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే

కారణం చెప్పి.. రామన్న కంటతడి

‘డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టారు’

‘ఏం జరిగిందని చలో ఆత్మకూరు?’

కాంగ్రెస్‌-ఎన్సీపీల సీట్ల సర్ధుబాటు

‘చంద్రబాబు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’

‘అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు’

గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన దత్తాత్రేయ

‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’

‘రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే ఆత్మకూరు వెళ్లి’..

చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు..

చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు

అందుకే చాపచుట్టి కృష్ణాలో పడేశారు : మంత్రి మోపిదేవి

ఊర్మిళ రాజీనామాకు వారే కారణం!

వివాదంగా మారిన లోక్‌సభ స్పీకర్‌ వ్యాఖ్యలు

మహిళా పోలీసుపై అఖిలప్రియ జులుం

టీడీపీ హైడ్రామా..

బాపురావు గృహ నిర్బంధం అన్యాయం

పల్నాడులో టీడీపీ నీచ రాజకీయాలు!

కారు పార్టీలో ఏం జరుగుతోంది..?!

కాంగ్రెస్‌కు రంగీలా భామ గుడ్‌బై

టీడీపీదే దాడుల రాజ్యం!

స్టేట్‌లో ఫైట్‌.. సెంట్రల్‌లో రైట్‌: రేవంత్‌రెడ్డి

పదవి రానందుకు అసంతృప్తి లేదు

విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలి

గులాబీ పుష్పక విమానం.. ఓవర్‌ లోడ్‌!

‘ప్రజాధనాన్ని దోచుకున్నవారికి చంద్రబాబు పునరావాసం’

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై..

‘చంద్రబాబు జిమ్మిక్కులు మాకు తెలుసు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా’లో విభేదాలు లేవు

బిగ్‌బాస్‌.. రవిని బురిడీ కొట్టించిన బాబా

‘మార్షల్‌’  పెద్ద హిట్‌ అవుతుంది : శ్రీకాంత్‌

అది నిజమే కానీ, అతను యాక్టర్‌ కాదు

ప్రియాంకకు వార్నింగ్‌ ఇచ్చిన పోలీసులు

'నిశ్శబ్దం'లో అనుష్క అదిరిపోయిందిగా..