‘లోకేష్‌కు ప్రకాశం బ్యారేజ్‌.. చంద్రబాబుకు పోలవరం’

7 Jun, 2019 10:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇవ్వడం మొదలు పెడితే చంద్రబాబు కోసం పోలవరం, ఆయన పుత్రరత్నం నారాలోకేష్‌ కోసం ప్రకాశం బ్యారేజీ ఇవ్వమంటారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తనపై చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ‘యనమల గారూ... మీరు అడగటం, మేం ఇవ్వటం మొదలుపెడితే లోకేష్‌ కోసం ప్రకాశం బ్యారేజీ, చంద్రబాబు కోసం పోలవరం ప్రాజెక్టు కూడా ఇవ్వమని అడగగల సమర్ధులు మీరు!’ అంటూ సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు. 

ఇక  రాజధానిలో కృష్ణా కరకట్ట వెంట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని తమకు ఇవ్వాలంటూ చంద్రబాబు రాష్ట్ర  ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబు రాసే తొలి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందనుకున్నామని, కానీ తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా? పోతుందా అనే సంశయమనం తప్ప.. ఇంకేమి లేదని విజయసాయిరెడ్డి గురువారం ఈ లేఖపై వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ప్రపంచం మొత్తాన్ని అమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా? అనే సందేహం కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ ట్వీట్‌పై యనమల ప్రెస్‌మీట్‌ పెట్టి మరి విజయసాయిరెడ్డికి కౌంటర్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రజావేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు రాసిన లేఖ మొదటిది కాదని, వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని లేఖరాసారని తెలిపారు.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు? కుప్పం, చంద్రగిరిలో నాయకులు అడ్డగోలుగా దోచుకోవడం వల్లే ప్రజలు పార్టీకి దూరమయ్యారని సమీక్షల్లో మీరు ఆవేదన చెందినట్టు మీడియాలో చూసి అంతా నవ్వుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే పచ్చ  మాఫియాను సృష్టించి  ఇప్పుడు నీతులు చెబితే ఏం లాభం?’ అని మరో ట్వీట్‌లో విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎంపీలకు ఢిల్లీ తెలుగు అకాడమీ సన్మానం

మంత్రుల డుమ్మాపై మోదీ ఫైర్‌

కర్నాటకంపై నేడే సుప్రీం తీర్పు 

మంచి రోడ్లు కావాలంటే టోల్‌ ఫీజు కట్టాల్సిందే 

బీజేపీలో చేరిన మాజీ ప్రధాని కుమారుడు

జయప్రద వర్సెస్‌ డింపుల్!

‘విభజన హామీలు నెరవేర్చుతాం’

అసెంబ్లీ ఎన్నికలు: కమలానికి కొత్త సారథి

‘కాపులను అన్ని విధాల ఆదుకుంటాం’

రెబెల్‌ ఎమ్మెల్యేల పిటిషన్‌పై రేపు సుప్రీం తీర్పు

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం

ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ

గందరగోళం సృష్టించేందుకు టీడీపీ యత్నం

‘పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం’

విశాఖలో టీడీపీ పంచాయితీ

‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్‌ చదువుకుంటే మంచిది’

కథ బెంగళూరు చుట్టూనే..

అంచనాలు పెంచి దోపిడీ చేశారు

18న బలపరీక్ష

కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!