‘స్వార్థం కోసం బాబు ఎంతకైనా తెగిస్తారు’

23 Jan, 2020 15:55 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు. శాసన సభలో అత్యధిక మెజార్టీతో ఆమోదం పొందిన రెండు చారిత్రాత్మక బిల్లులను(అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లు) చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసం మండలిలో అడ్డుకున్నారని ఆరోపించారు.

(చదవండి : పవన్‌కు బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు!)

తన వ్యూహంలో భాగంగానే రెండు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపేలా కుట్రపన్నారని ఆరోపించారు. చంద్రబాబు తన మనుగడ కోసం ఎంత నీచానికైనా తెగిస్తాడనడానికి బుధవారం మండలిలో జరిగిన పరిణామాలే నిదర్శమన్నారు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయిందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా