‘మత్తు డాక్టర్‌ను సస్పెండ్‌ అయ్యేదాకా రెచ్చగొట్టారు’

18 May, 2020 14:11 IST|Sakshi

ట్వీటర్‌ వేదికగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి  ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  ఉద్యోగం చేసుకుంటూ తన మానాన తను బతుకున్న మత్తు డాక్టర్‌ సుధాకర్‌ను టీడీపీ నాయకులు రోడ్డున పడేశారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన వరస ట్వీట్లు చేశారు. 
(చదవండి : అదంతా చంద్రబాబు ఆడించిన నాటకమే!)


‘ఉద్యోగం చేసుకుంటూ తన మానాన తను బతుకుతున్న మత్తు డాక్టర్ ను పచ్చపార్టీ వాళ్లు రోడ్డున పడేశారు. సస్పెండ్ అయ్యేదాక రెచ్చగొట్టారు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే  పోలీసులు మెంటల్ హాస్పిటల్ కు తరలించారు. యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వచ్చిందని సైకియాట్రిస్టులు తేల్చారు’ అని ట్వీట్‌ చేశారు.

‘కరోనాపై పోరుకు చంద్రబాబు ఇచ్చిన 10 లక్షల విరాళాన్ని ఐదు కోట్ల మందికి పంచితే, తలకు రెండు పైసలు వస్తాయని నెటిజెన్లు లెక్క తేల్చారు. కుటుంబానికో కోడి గుడ్డు కూడా రాదు కదా బాబూ. ఈ మాట ఎవరైనా అడిగితే, ఓడించిన ప్రజలకు సంపాదనంతా ఇచ్చి లోకేశాన్ని రోడ్డున పడేయాలా అని ప్రశ్నిస్తాడేమో!’  అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. 

‘కరోనాతో ప్రజలు టెన్షన్ పడుతుంటే నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నాడు చంద్రబాబు. ఎదుటి వారి దురదృష్టాన్ని చాటుగా గమనిస్తూ ఆనందించే వారిని సైకాలజీలో శాదన్ ఫ్రాయిడా (schadenfreude) అనే రుగ్మతకు గురైన వారిగా భావిస్తారు. బాబుది ఆ కేసే!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు