ర్యాంకింగ్స్ ఇస్తే ఆయనకు ఆఖరి స్థానం కూడా కష్టమే

26 Jan, 2020 14:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులకు ఎవరైనా ర్యాంకింగ్స్‌ ఇస్తే చంద్రబాబుకు ఆఖరు స్థానం కూడా దొరకదంటూ ఎద్దేవా చేశారు. 8 నెలల్లో ఒక జెండా లేదు. ప్రజా సమస్యల మీద గళమెత్తిన సందర్భం లేదు. ఇసుక మాఫియాను కాపాడేందుకు కొరత అంటూ రంకెలు వేశాడు. కడాన రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవతారమెత్తి జోలెతో ఊరేగాడంటూ' చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. మరో ట్వీట్‌లో.. 'అప్పట్లో కౌన్సిల్‌ను పునరుద్ధరించాలని వైఎస్సార్ ప్రతిపాదించినప్పుడు ఇదే చంద్రబాబు డబ్బులు దండగ అన్నాడు. ప్రస్తుతం సీఎం జగన్ కౌన్సిల్ వల్ల ఖర్చు తప్ప ప్రయోజనం లేదనగానే, మీరు రద్దు చేస్తే నేనొచ్చాక మళ్లీ తెస్తా అని బట్టలు చించుకుంటున్నాడు. విజనరీది మాట మీద నిలకడ లేని బతుకు' అంటూ విమర్శలు గుప్పించారు. యనమల కుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసు..

కాగా మరో ట్వీట్‌లో..టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడిపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు వెన్ను పొడిచి ఆయన అకాల మరణానికి కారకుడైన వారిలో చంద్రబాబు తర్వాత రెండో దోషి యనమల. పెద్దాయన ఉసురు తగిలి తుని ప్రజలు తరిమికొట్టడంతో దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయనిప్పుడు నీతి చంద్రికలు చదువుతూ పత్తి గింజలా ప్రగల్భాలు పలుకుతున్నాడు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

బాబుకు షాకిచ్చిన ఎమ్మెల్సీలు.. కీలక భేటీకి డుమ్మా!

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు