ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..?

22 Feb, 2020 12:17 IST|Sakshi

సాక్షి, అమరావాతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైన విషయం తెలిసిందే. వీటి ఆధారంగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్‌ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ విషయంపై విజయసాయిరెడ్డి ట్విటర్‌లో స్పందించారు. 'అహ్మద్ పటేల్ కు పంపిన రూ.400 కోట్లే కాదు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణ ఎన్నికల్లో రూ.400 కోట్లు ఖర్చుపెట్టాడు. అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రం సీఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశాడు' అని చెప్పారు.  చదవండి: ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ: విజయసాయి రెడ్డి

'మద్యం ధరలు పెంచి మందు బాబుల పొట్ట కొడుతున్నారని రంకెలేస్తాడు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వమనుకుంటే అడ్డుపడతాడు. ఇన్ సైడర్ ట్రేడింగు పైనా దర్యాప్తు జరపొద్దట. తన మాజీ పిఎస్ అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటాడు. ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి?' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: ఆస్తుల ప్రకటన రోటీన్‌ డ్రామా : విజయసాయిరెడ్డి

కాగా మరో ట్వీట్‌లో 'కమీషన్ల కోసం ఎక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకొని ఏపీ ట్రాన్స్ కోకు 70 వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్లాడు బాబు. ఈ పీపీఏల దళారి ఎవరంటే కిరసనాయిలు. అక్రమ సంపాదన ఆగిపోయిందనే సీఎం జగన్ గారిని పీపీఏల రద్దుపై ప్రధాని మోదీ నిలదీశారని బోగస్ వార్త రాశాడు' అంటూ పచ్చ మీడియా రాతలపై విరుచుకుపడ్డారు.

చదవండి: 'టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట'

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముందుచూపు లేని మోదీ సర్కారు

ఏడాది కింద కరోనా వచ్చుంటేనా..

నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేశా.. టీడీపీపై ఫైర్‌

మతమౌఢ్యం తలకెక్కిన ఉన్మాది ఒవైసీ..

మోదీ పిలుపు; నిద్రొస్తే నిద్రపోతా : మమతా 

సినిమా

వైరస్‌ గురించి ముందే ఊహించా

కరోనా పాజిటివ్‌.. 10 లక్షల డాలర్ల విరాళం!

ఏడాది జీతాన్ని వ‌దులుకున్న ఏక్తాక‌పూర్‌

అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?