ఏం బతుకులు మీవి..?: విజయసాయిరెడ్డి

23 Feb, 2020 11:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై ఎల్లోమీడియాలో వస్తోన్న వార్తలపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 'విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు' అంటూ ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.


కాగా మరో ట్వీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'మద్యం వ్యసనం నుంచి బయటపడుతున్న వారిని రెచ్చగొట్టి మళ్లీ బానిసలను చేసే దాకా చంద్రబాబు నిద్రపోయేట్టు లేరని, పద్నాలుగేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇంత బాధ్యత లేకుండా మాట్లాడటం దేశంలో ఎక్కడా కనిపించదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిపుడే తాగుడుకు దూరమవుతున్న వారు తమ భార్యాపిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్నారంటూ' విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చదవండి: ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..?

ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ
'టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట'

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా