ఇది 21వ శతాబ్దం కిట్టప్పా కేరాఫ్‌ ఆంధ్రజ్యోతి

12 Jul, 2020 18:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని వ్యవహారంపై ఆంధ్రజ్యోతి అవలంభిస్తున్న తీరు, ప్రచురిస్తున్న కథనాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'ఏంటి కిట్టు కేరాఫ్‌ ఆంధ్రజ్యోతి. రాజధాని వ్యవహారంపై బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తమరే చెప్తారా? బీజేపీకి మంచి పాలనా అనుభవం వుంది. మీ ఉచిత సలహాలు ఏల? కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అంతలా భయపడకు - నీ పార్ట్నర్ చంద్రబాబు కోసం తెరవెనుక ప్రయత్నాలు కొనసాగించు.

ప్రధాని మనసులో ఏముందో తొంగి చూస్తావు. జగన్ గారి ఆలోచనేంటో ఆర్నెళ్ల ముందే పసిగట్టేస్తున్నావ్. వదిలేస్తే ట్రంప్, జిన్ పింగ్ సీక్రెట్స్‌నూ బయటపెట్టేస్తావ్. వెర్రి గొర్రెల్లా జనం నమ్మేస్తారనుకున్నావా? ఇది 21వ శతాబ్దం కిట్టప్పా కేరాఫ్‌ ఆంధ్రజ్యోతి. అప్పుడే ఎన్నికలంటూ ఎత్తుకున్నావేంటి?' అంటూ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. చదవండి: చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు..

'రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు కొనుగోలు కోసం మార్క్ ఫెడ్ కు 200 కోట్లు కేటాయించి, సిఎం జగన్ గారు రైతుల పట్ల తన అభిమానాన్ని మరో మారు చాటారు. మార్క్ ఫెడ్ దూకుడు పెంచడంతో కిలో పొగాకు ధర రూ.5 నుంచి 10 కి ఎగిసింది. ఇంకా పెరిగి రైతన్నల కష్టాలకు ప్రతిఫలం లభిస్తుంది. 

హోం క్వారంటైన్లో ఉన్న కరోనా రోగులకు ప్రత్యేక కిట్లు అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో మందులు, మాస్కులు, గ్లవ్స్, శానిటైజర్లు, పల్స్ ఆక్సీమీటర్లు ఉంటాయి. వ్యాధి బారిన పడిన వారిని పసిబిడ్డల్లా రాష్ట్ర ప్రభుత్వం సంరక్షిస్తోంది. ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక అభినందనలు' అంటూ వరుస ట్వీట్‌లలో పేర్కొన్నారు. 
చదవండి: ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు..

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా