‘విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయొద్దు’

10 Apr, 2020 14:15 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : లాక్‌డౌన్‌ కాలంలో పేద ప్రజలు ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటి ఆరోగ్య సర్వే పకడ్బందీగా జరుగుతుందన్నారు. రైతులు, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం హాట్‌స్పాట్‌ కాని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ సడలించాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. 

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద పారిశ్రామికవేత్తలు పేదలకు అండగా ఉండాలని విజయసాయిరెడ్డి కోరారు. ఇప్పటివరకు విశాఖలో సీఎం, పీఎం సహాయ నిధికి రూ. 6 కోట్ల నిధులు విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవుపలికారు. 

చదవండి : ‘వ్యయం పెంచి లగడపాటికి అప్పగించారు’

వారి సేవలు ప్రశంసనీయం: విజయ సాయిరెడ్డి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా