ఇ,ఇ, రికార్డులు అరిగిపోయి ‘ఉ’ మీద పడ్డారు..

6 Dec, 2019 12:11 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని గురించి ఎందుకు వ్యక‍్తిగతంగా తీసుకుంటున్నారో ప్రజలకు బాగా అర్థమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ‘రియల్‌ ఎస్టేట్‌ ధరలు తగ్గాయనేదే ఆయన ప్రధాన బాధ. ల్యాండ్‌ మాఫియా కోసమే రాజధాని పర్యటన. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు. ప్రజల కోసం ఏనాడూ పనిచేసింది లేదు’ అంటూ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

 ‘ఇ’సుక, ‘ఇం’గ్లీష్ మీడియం రికార్డులు అరిగిపోయాక ఇప్పుడు ‘ఉ’ల్లిపాయల మీద పడ్డారు. ఇది ఒక్క మన రాష్ట్ర సమస్యే కాదు. ప్రజలను రెచ్చగొట్టడానికి ఏదో ఒక సమస్య కావాలిగదా. రైతు బజార్లలో కిలో రూ.25కు అందజేస్తున్న సంగతి మాట్లాడరు. ఇ,ఇ,ఉ తర్వాత తర్వాత దేని గురించి ఎగిరి పడతారో అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

‘ప్యాకేజీ స్టార్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. సినిమాల్లో డబుల్, ట్రిపుల్ యాక్షన్లు చేసినట్టు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేర్వేరు అవతారాలు ధరిస్తాడు. వింతేమిటంటే ఒక పక్క యజమాని చంద్రబాబు నాయుడును సంతృప్తి పరుస్తూనే, ఇంకో పక్క బీజేపీతో బేరసారాలు సాగిస్తున్నాడు. వాహ్ పావలా...!’ అంటూ జనసేన అధినేతపై విమర్శలు గుప్పించారు.

>
మరిన్ని వార్తలు