ఛీ.. ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా?

22 Aug, 2019 18:05 IST|Sakshi

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపాటు

సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కులం పేరిట సోషల్‌ మీడియాలో దూషించిన ఉదంతంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఛీ.. ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబుగారూ’ అంటూ నిలదీశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే.. కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కులం, వృత్తిని దూషించి యావజ్జాతిని అవమానిస్తారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 

ఆయన ట్వటర్‌లో ఏమన్నారంటే.. ‘ఛీ.. ఇంత నీచానికి తెగబడాల్సిన అవసరముందా చంద్రబాబుగారూ. జూనియర్ ఆర్టిస్టులను వరద బాధితులుగా యాక్షన్ చేయించి ప్రభుత్వాన్ని తిట్టిస్తారా? యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఇరిగేషన్ మంత్రి అయితే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కులం, వృత్తిని దూషించి యావజ్జాతిని అవమానిస్తారా?’ 

ఇక, చంద్రబాబు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాదృచ్ఛికమేమీ కాదని, ఆ పాద మహిమ అలాంటిదని పేర్కొంటూ.. చిదంబరం అరెస్టు, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం ఉదంతాలను ప్రస్తావించారు. 

‘బాబు గారు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాధృచ్ఛికమేమీ కాదు. పాద మహిమ అలాంటిది. ఇప్పుడు చిదంబరం గారికి పీకల్లోతు కష్టాలొచ్చాయి. ఎన్సీపీ ఎమ్మెల్యులు పార్టీ మారుతుంటే శరద్ పవార్ గారు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయి’అని ఆయన ట్వీట్‌ చేశారు.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోలవరం ఆపేస్తున్నట్లు టీడీపీ హడావుడి..

‘చంద్రబాబు దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం’

‘ఆ ఆర్టికల్‌’ గురించి పాలకులకు తెలుసా ?

శివసేనలో చేరిన నిర్మలా గావిత్‌

రాజధాని ముసుగులో అక్రమాలు

దిగజారుడు విమర్శలు

బీజేపీ లేకుంటే కవిత  ఎలా ఓడారు?: కిషన్‌రెడ్డి 

అవినీతిని కేసీఆరే  ఒప్పుకున్నారు: జీవన్‌రెడ్డి

యోగి కేబినెట్‌లో మరో 18 మంది

ఇదీ.. చిదంబరం చిట్టా

ఇక కమలమే లక్ష్యం! 

చిదంబరం అరెస్ట్‌

మంత్రివర్గ విస్తరణ;18 మందికి చోటు!

బిల్‌గేట్స్‌, అంబానీలను తయారు చేస్తా: గౌతమ్‌ రెడ్డి

‘జ్యోతి ప్రజ్వలన’పై సీఎం రమేశ్‌కు గట్టి కౌంటర్‌

కేసీఆర్‌, కేటీఆర్‌లపై విజయశాంతి విసుర్లు

అందుకే బాబు సైలెంట్‌ అయ్యారేమో!?

కేసీఆర్‌ 31 జిల్లాల పేర్లు పలకగలరా?

పియూష్‌ను కలిసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు

చిదంబరానికి రాహుల్‌ మద్దతు

హైదరాబాద్‌ దేశానికి రెండో రాజధాని కాదు..!

‘సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌’ కేసు ఏమవుతుంది !?

‘అందుకే చంద్రబాబు భయపడ్డారు’

‘ఆ పూజారి కొబ్బరి చిప్పల్ని కూడా వదల్లేదు’

ఇదేం న్యాయం: యడ్డీకిలేనిది మాకెందుకు?

అన్యాయం ఎవరు చేశారో అందరికీ తెలుసు..

‘పార్టీలోని పచ్చ పుష్పాలతో తస్మాత్‌ జాగ్రత్త..’

చిదంబరం అరెస్ట్‌కు రంగం సిద్ధం!

మోదీ సర్కారుపై ప్రియాంక ఫైర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

అక్కీ సో లక్కీ..

చిరుకు చిరుత విషెస్‌

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

చందమామతో బన్నీ చిందులు