ప్రతిపక్షం లేకుండా చేశారు

19 Nov, 2019 03:13 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై విజయశాంతి ధ్వజం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆర్టీసీ యూనియన్లు, ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయంటూ హైకోర్టులో ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ చేస్తున్న వాదనలు విడ్డూరంగా ఉన్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంకు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించి విలువలకు తిలోదకాలిచ్చారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర ప్రతిపక్షాలు చేయడం లేదని, ఆయన పక్కన ఉన్న వారే చేస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నేతలంతా తమ పార్టీలో చేరుతారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారని, అందుకే బీజేపీ పేరు చెప్పలేక ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని కోర్టుకు తన ఆందోళన తెలియజేసి ఉంటారని ఆ ప్రకటనలో ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు