దోచుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చా.. వైరల్‌ వీడియో

20 Mar, 2018 14:04 IST|Sakshi

పాట్నా: ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయల్లో డబ్బులు ఎలా సంపాదిస్తారో చెప్పినందుకు, కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎంపీకి హ్యాట్స్ ఆప్‌ అంటూ ఒక మెసేజ్‌తో పాటు అతను మాట్లాడిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే బిహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఆర్జేడీ ఎంపీ మాట్లాడిందిగా చెప్పబడ్డ ఆ వీడియో ఫేక్‌ అని తేలిపోయింది. 

వీడియోలో ఉన్న వ్యక్తి ఏమన్నారంటే.. ‘నేను రాజకీయల్లోకి డబ్బు సంపాదించడానికే వచ్చాను, నా దృష్టి అంత ఎలా దోచుకోవాలన్న దానిపైనే ఉంది. ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏవిధంగా డబ్బు సంపాదిస్తున్నారో నేను అలాగే సంపాదిస్తా. ఏం చేస్తే డబ్బులోస్తాయో నాకు తెలియదు కానీ అధికారులున్నారుగా చెప్పడానికి, అయినా ప్రతి ప్రాజెక్టులో 25 శాతం వస్తాయని విన్నాను. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలను ఫూల్స్‌ చేస్తూ ఓ వ్యక్తి ప్రధానమంత్రి అయినప్పుడు నేను చేయలేనా’  అని అన్నారు. 

అయితే ఈ వీడియో ఆర్జేడీ ఎంపీది కాదని.. అసలు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, అసలు బిహార్‌ కు సంబంధించిన వ్యక్తే కాదని ఆర్జేడీ పార్టీ పేర్కొంది. ఇంతకీ అందులో ఉన్న వ్యక్తి ఎవరంటే.. 2017 ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఆగ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తి గోపాల్‌ చౌదరీ అని తేలింది.

మరిన్ని వార్తలు