అభ్యర్ధి క్రిమినల్‌ అయినా సరే! మద్దతివ్వాలి..

26 Oct, 2019 12:20 IST|Sakshi

రాంచీ : జార్ఖండ్ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్ధి క్రిమినల్‌, దొంగ, దివ్యాంగుడైనా అతనికి అన్ని విధాలా మద్దతివ్వాలి. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌లపై నమ్మకముంచి వారి నిర్ణయాలను గౌరవించాలి. బీజేపీ అవినీతి పార్టీ కాదు. డబ్బులు తీసుకుని టిక్కెట్‌ ఇచ్చే సంస్కృతి పార్టీలో లేదన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి’ అని పార్టీ శ్రేణులకు ఉద్భోదించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత చిదంబరం లాంటి వారిని అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాం. ఇంకొద్ది రోజుల్లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. కాగా జార్ఖండ్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఎన్నికలకు సంసిద్ధులను చేయడానికి నిర్వహించిన సమావేశంలో దూబే పైవిధంగా స్పందించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు