ప్రియాంక ప్రభావం ఎవరిపై ఉంటుంది?

9 Feb, 2019 14:53 IST|Sakshi

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఆంగ్ల వార్తాచానెల్‌ ఇండియాటుడే ‘పొలిటికల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌’ పేరుతో తాజాగా ఒక సర్వేను నిర్వహించింది. ప్రియాంక గాంధీ రాకతో కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద ఒరిగేదేంలేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ పనితీరుపై యూపీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. (ప్రియాంక సమర్థతకు అగ్నిపరీక్ష)

పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌ పునరుజ్జీవం సాధ్యమవుతుందా?
సాధ్యం కాదు–57%     
సాధ్యమవుతుంది–27%
తెలియదు–16%

ప్రియాంక ప్రభావం ఎవరిపై ఎలా ఉండనుంది?
ఎస్పీ, బీఎస్పీ కూటమిపై ఉంటుంది–56%
బీజేపీపై ఉంటుంది– 31%
తెలియదు– 13%

ఎస్పీ–బీఎస్పీ కూటమి బీజేపీని దెబ్బతీస్తుందా?
బీజేపీని దెబ్బ తీస్తుంది– 35%
బీజేపీపై ప్రభావం ఉండదు– 48%
తెలియదు– 17%

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?
సంతృప్తికరంగా ఉంది– 42%
సంతృప్తికరంగా లేదు– 39%
సాధారణంగా ఉంది– 15%
తెలియదు– 04%

కేంద్ర ప్రభుత్వ తీరు ఎలా ఉంది?
సంతృప్తికరంగా ఉంది– 54%
సంతృప్తికరంగా లేదు– 32%
సాధారణంగా ఉంది– 11%
తెలియదు– 03%

అగ్రవర్ణ పేదలకు 10% కోటా ప్రభావం బీజేపీపై ఎలా ఉంటుంది?
బీజేపీకి సానుకూలంగా ఉంటుంది– 49%
బీజేపీకి ప్రతికూలంగా ఉంటుంది– 31%
ఏ ప్రభావమూ ఉండదు– 02%
తెలియదు– 18%

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందనుకుంటున్నారా?
అవును– 47%
లేదు– 35%
తెలియదు– 18%

పెద్ద నోట్లరద్దు నిర్ణయంపై మీ అభిప్రాయం?
మంచి నిర్ణయం– 53%
తప్పు నిర్ణయం– 34%
ఎలాంటి ప్రయోజనం లేదు– 11%
తెలియదు– 02  

మరిన్ని వార్తలు