బదిలీ కాని ఓటు.. అంచనాలు తలకిందులు.!

15 Dec, 2018 09:58 IST|Sakshi

పారని మహాకూటమి మంత్రం

నాలుగు చోట్ల అభ్యర్థుల పరాజయం

2014లో రెండో స్థానం పొందిన టీడీపీ అభ్యర్థులు, రెబల్‌

ఈ ఎన్నికల్లో ఆ ఓట్లన్నీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే

తలకిందులైన కాంగ్రెస్‌ అంచనాలు

రెండుచోట్ల గట్టెక్కిన హస్తం

సాక్షిప్రతినిధి, నల్లగొండ : మహా కూటమి మంత్రం పారలేదు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు కలిస్తే గణనీయమైన ఓట్లు వస్తాయని, తేలిగ్గా విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్‌ నాయకత్వం అంచనాలు తలకిందులయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ ఒక జట్టుగా.., టీడీపీ, బీజేపీ మరో జట్టుగా.. టీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీచేశాయి. ఈసారి ఎన్నికల్లో మహా కూటమి పేర కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ చేతులు కలిపాయి.

గత ఎన్నికల్లో ఈ పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే.. ఈసారి మహాకూటమి అభ్యర్థులకు తేలికైన విజయాలు దక్కాలి. కానీ, వాస్తవంలో అలా జరగకపోవడం, నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పరాజయం పాలుకావడంతో కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ కాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లును కలిపితే, గెలుపోటములతో సంబంధం లేకుండా దాదాపు అన్ని స్థానాల్లో మహా కూటమికి ఖాతాలోనే ఎక్కువ ఓట్లు కనిపిస్తున్నా యి. అయితే.. ఈ ఎన్నికల్లో ఆ ఓట్లన్నీ కూటమి అభ్యర్థులకు (కూటమి పక్షనా అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే పోటీ చేశారు) గంప గుత్తగా పడతాయని ఆశించిన కాంగ్రెస్‌ నాయకత్వానికి ఆశాభంగం జరగగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు గణనీయమైన ఓట్లు పోలయ్యాయి. 

బలపడిన టీఆర్‌ఎస్‌
గత ఎన్నికల్లో దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో మూడు స్థానంలో, నాగార్జునసాగర్, మిర్యాలగూడలో రెండో స్థానంలో నిలవగా, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. కానీ, ఈసారి నకిరేకల్, మునుగోడు స్థానాలను కోల్పోయి, గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఐదేళ్లుగా జరిగిన మార్పులు, చేర్పులు, చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో టీఆర్‌ఎస్‌ చాలా చోట్ల బలపడింది.

గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవరకొండ నియోజకవర్గంలో రెండో స్థానంలో నల్లగొండలో టీడీపీ రెబల్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరికి వచ్చిన ఓట్లు ఈ సారి కూటమికి బదిలీ కాలేదన్న అంశం తాజా ఓట్ల గణాంకాలు స్ప ష్టం చేస్తున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు కూటమి భా గస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐల ఓట్లు బదిలీ కాకపోగా, ఆ తేడా భారీగా కనిపిస్తోంది. పక్కాగా ఓటు బదిలీ జరిగి ఉం టే నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు అవకాశం దక్కేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌ నియోజకవర్గాల్లో ఇలా..
నాగార్జున సాగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై 7,771 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ, ఇక్కడ కూటమి ఓట్లన్నీ కలిస్తే (2014 గణాంకాలు)నే బదిలీ కాకుండా పోయిన ఓట్లు 21,658. గతం కన్నా ఈ సారి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. అంటే కూటమి బదిలీ అయి ఉంటే జానారెడ్డి ఓటమి కోరల నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదంటున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి 23,698 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

కానీ, ఈ నియోజకవర్గంలో 35,907ఓట్లు కూటమి బదిలీ కాలేదు. దీంతో ఆయనకూ ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన (బీజేపీ, టీడీపీ ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి)4523 ఓట్లును ఈ సారి మినహాయించినా కూటమికి బదిలీకాకుండా పోయిన ఓట్లు 31,384. ఈ లెక్కన చూసినా, కాంగ్రెస్‌కు అవకాశం ఉందేం టున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో కాం గ్రెస్‌తో జతకట్టిన టీడీపీ, సీపీఐ తదితర పార్టీల కూటమి పక్షాల ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీకాకపోవడం ఆ పార్టీ అభ్యర్థుల ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు