మొదటి నుంచి ఏపీకి మద్ధతుగా ఉన్నాం: టీఆర్‌ఎస్‌

18 Jul, 2018 19:32 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ ఎంపీ సీతారాం నాయక్‌(పాత చిత్రం)

ఢిల్లీ: ప్రత్యేక హోదా విషయంలో గత సమావేశాల మాదిరిగా ఈసారి కూడా పార్లమెంటు  సమావేశాలు వృధా కాకుండా ఉండేందుకు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించారని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు మొదటి నుంచి మద్ధతుగా ఉన్నామని టీఆర్‌ఎస్‌ మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ తెలిపారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీకి నష్టం జరిగిందనే సాకుతో కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడం ఏపీ ప్రభుత్వానికి తగదని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి మా మద్ధతు అడగటం మాకు నచ్చలేదని తెలిపారు.

అవిశ్వాస తీర్మాన చర్చలో తమ పార్టీ ఎంపీలు పాల్గొంటారని, చర్చలో కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడతామని వివరించారు. పార్లమెంటరీ పక్ష నేతలు ఓటింగ్‌పై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. విభజన చట్టం అమలు, కేంద్రం వైఖరి పట్ల తాము సంతృప్తిగా లేమని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని ఇప్పుడు కూడా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ డిమాండ్లను పార్లమెంటులో కేంద్రం ముందు ఉంచుతామని సీతారాం నాయక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు