తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం

23 Feb, 2019 14:57 IST|Sakshi

తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం

అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: గత హయాంలోని తెలంగాణ తొలి కేబినెట్‌లో మహిళలకు అవకాశం లభించని విషయం తెలిసిందే. ఈ విషయంలో విమర్శలు వచ్చినా.. అప్పట్లో కేసీఆర్‌ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఈసారి మొదటి విస్తరణలోనూ కేబినెట్‌లో మహిళకు అవకాశం దక్కలేదు. గత మంగళవారం 10మంది మంతులతో కేబినెట్‌ను కేసీఆర్‌ విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హయాంలోనైనా మహిళా మంత్రులు ఉంటారా? అసలు కేసీఆర్‌ ప్రభుత్వం మహిళలకు మంత్రులుగా అవకాశం ఇస్తుందా? అన్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విషయమై ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టత నిచ్చారు. కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేబినెట్‌లో మహిళకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కోరగా.. ఒక్కరికి కాదు ఇద్దరికి అవకాశం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. మహిళలు అధికంగా ఓట్లు వేయడంతోనే తాము భారీ అధిక్యంతో అధికారంలోకి వచ్చామన్నారు.

మరిన్ని వార్తలు