వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు

26 Feb, 2019 16:23 IST|Sakshi

విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశంలో అందరి విలువైన సూచనలు తీసుకున్నామని వైఎస్సార్‌సీపీ అగ్రనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలు, నవరత్నాలన్నీ మేనిఫెస్టోలో ఉంటాయన్నారు. మేనిఫెస్టోలో సూచనలు, సలహాలు మెయిల్‌ఐడీకి పంపాలని కోరారు. అన్ని వర్గాల సమస్యలకు పరిష్కారాలు మా మేనిఫెస్టోలో ఉంటాయని స్పష్టం చేశారు.

రాజధాని అమరావతిని మార్చుతారన్న వదంతులు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వ్యవసాయం, సాగునీరు, మహిళలు, సంక్షేమం, విద్య, ఉపాధి, యువత సంబంధిత అంశాలు, వైద్యం, ఉద్యోగం, పెన్షనర్లు, ఎక్స్‌ సర్వీస్‌మేన్‌, హౌసింగ్‌, పరిశ్రమలు, ఎన్నారైల సమస్యలన్నీ మేనిఫెస్టోలో ఉంటాయన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తామని, మార్చి 6న మేనిఫెస్టో కమిటీ మరోసారి భేటి అవుతుందని వెల్లడించారు.

మరిన్ని వార్తలు