నర్సాపురం పార్లమెంటు: అన్ని స్థానాలనూ గెలుస్తాం!

19 Mar, 2019 14:29 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: తణుకులో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు, తణుకు అసెంబ్లీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. జగన్‌మోహనరెడ్డిని ఎదుర్కోవడం కోసం అన్ని పార్టీలు చీకట్లో ఒప్పందం కుదుర్చుకున్నాయని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. ఎవరు కలిసినా.. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకోలేరని ఆయన అన్నారు. ఐదేళ్లపాటు అధికారాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు అరాచకాలు చేశారని.. మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.

జోరుగా ప్రచారం..
నెల్లూరు: నెల్లూరు సిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. శెట్టిగుంటరోడ్డు, మైపాడు సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నవరత్నాలను వివరిస్తూ ప్రచారం ముందుకు కొనసాగించారు. టీడీపీ అభ్యర్థి నారాయణ.. కోట్లాది రూపాయలు వెదజల్లి గెలుపొందాలని యత్నిస్తున్నారని అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. నెల్లూరు వాసులకు సేవ చేసే అవకాశం తనకు ఇవ్వాలని, ఇందుకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. 41 అసెంబ్లీ, ఏడు లోక్ సభ స్థానాలను బీసీలకు కేటాయించి మాటపై నిలబడిన నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు .

 ఉరవకొండలో నిర్వహించిన బీసీ గర్జన సభ
ఐదేళ్లలో బీసీలను పట్టించుకోని చంద్రబాబు... ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలతో కపట ప్రేమ చూపిస్తున్నారని అనంతపురం జిల్లా ఉరవకొండ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి తలారి రంగయ్య అన్నారు. అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంట్‌ సీట్లను బీసీలకు ఇస్తే జేసీ సోదరులు జడుసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉరవకొండలో నిర్వహించిన బీసీ గర్జన సభలో వై.విశ్వేశ్వర్‌రెడ్డి, తలారి రంగయ్య పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందరూ అండగా ఉండాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు