వార్‌ వన్‌ సైడే: ఎంపీ కవిత

30 Jan, 2019 10:25 IST|Sakshi

నిజామాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడేనని ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 16 పార్లమెంట్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. మరొక సీటు ఎంఐఎం గెలుచుకుంటుందన్నారు. ‘తెలంగాణలోని 16 ఎంపీ సీట్లలో టీఆర్‌ఎస్‌దే విజయం. సెక్రటేరియట్‌లో కోసం డిఫెన్స్‌ ల్యాండ్‌ విషయంలో కేంద్రం సహకరించడం లేదు. ఇవ్వాళ ఢిల్లీకి వెళ్తున్నాం.

పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలంతా పోరాటం చేస్తాం. ప్రధాని మోదీని కూడా కలిసి నిలదీస్తాం. గరీబీ హఠావో లాంటి కాంగ్రెస్‌ నినాదాలు స్లోగన్స్‌ వరకే మిగిలిపోతున్నాయి. ప్రియాంక గాంధీ వచ్చినా దేశానికి ఒరిగిదేమీ లేదు. బీజేపీ-కాంగ్రెసేతర పార్టీలు కేంద్రంలో రావాలి. గల్ఫ్‌ బాధితుల విషయంలో ఏజెంట్లపై చర్యలు తీసుకునే ప్ర‍క్రియ చేపడుతున్నాం’ అని కవిత పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు