మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన బీజేపీ అధ్యక్షుడిపై దాడి

1 Jul, 2020 14:25 IST|Sakshi
దాడిలో ధ్వంసమైన దిలీప్‌ ఘోష​ వాహనం

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌పై కొందరు దుండగలు దాడికి పాల్పడారు. బుధవారం మార్నింగ్‌ వాక్‌ వెళ్లిన తనపై రాజర్హట్‌ ప్రాంతంలో టీఎంసీ మద్దతుదారులు దాడికి చేసినట్టుగా దిలీప్‌ ఆరోపించారు. ఈ దాడిలో తన వాహనం కూడా ధ్వంసం అయిందని తెలిపారు. తనను రక్షించాలని చూసిన భద్రతా సిబ్బందిపై కూడా టీఎంసీ మద్దతుదారులు దాడి చేశారని చెప్పారు. ఈ ఘటన చూస్తుంటే బెంగాల్‌ శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. (చదవండి : విషాదం: బాయిలర్‌ పేలి ఐదుగురు మృతి)

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నేను రాజర్హట్ న్యూటౌన్‌ ప్రాంతంలో ఉంటాను. ముందుగా అనుకున్న ప్రకారం ఈ రోజు ఉదయం నేను కోచ్‌పుకుర్‌ గ్రామ సమీపంలోని ఓ టీ స్టాల్‌ వద్దకు వెళ్లాలి. అక్కడ నా కోసం మా పార్టీ కార్యకర్తలు వేచి ఉన్నారు. కానీ అక్కడికి చేరుకోక ముందే తృణమూల్‌ మద్దతుదారులు నన్ను అడ్డుకున్నారు. నాపై చేయి చేసుకోవడమే కాకుండా.. నా సెక్యూరిటీ గార్డ్స్‌పైన కూడా దాడి చేశారు. నా పర్యటన గురించి స్థానిక పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినప్పటికీ.. వారు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. చిరకు నేను ఆ టీ స్టాల్‌ వద్దకు చేరుకునే సరికి అక్కడ రోడ్లపై ఖాలీ కుర్చీలు దర్శనమిచ్చాయి’ అని తెలిపారు. అలాగే టీఎంసీ నాయకుడు టపాక్‌ ముఖర్జీ నేతృత్వంలోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. అయితే దిలీప్‌ ఆరోపణలను ముఖర్జీ ఖండించారు.

మరిన్ని వార్తలు