వర్సిటీల్లో స్వేచ్ఛ ఎప్పుడు?

6 Oct, 2019 05:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విద్యార్థులకు ఐన్‌స్టీన్‌ చాలెంజ్‌ విసరడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం స్పందించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ నిలయాలుగా ఎప్పుడు మారుతాయని ప్రశ్నించారు. మనీలాండరింగ్‌ ఆరోపణలపై ప్రస్తుతం తిహార్‌ జైలులో ఉన్న చిదంబరం కోరిక మేరకు కుటుంబసభ్యులు ఓ ట్వీట్‌ చేశారు. అందులో.. ‘ప్రధాని మోదీ విద్యార్థులకు ఐన్‌స్టీన్‌ చాలెంజ్‌ విసిరినందుకు  సంతోషం. ఐన్‌స్టీన్‌ చెప్పినట్లుగా.. బోధన, రచన, పత్రిక రంగాల్లో స్వేచ్ఛ ప్రజల సహజ, ఉన్నత వికాసానికి పునాది వంటివి’. అయితే, మన వర్సిటీలు అటువంటి వాస్తవమైన స్వేచ్ఛా నిలయాలుగా ఎప్పుడు మారతాయి?’అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు