బంగారు తెలంగాణ ఏదీ?

11 Jun, 2018 15:48 IST|Sakshi
ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న చుక్కా రాములు  

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు

గంగారం గ్రామంలో ప్రజల సమస్యలపై బీఎల్‌ఎఫ్‌ సర్వే

కొండాపూర్‌(సంగారెడ్డి): బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం దూసుకెళ్తుందని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పల్లెలో మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయనీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు.దివారం మండల పరిధిలోని గంగారం గ్రామంలో ఆయన పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా నేటికీ చాలా గ్రామాలలో మురికి కాల్వలు, రహదారులు, మంచి నీటికి కూడా నోచుకోకపోవడం బాధాకరమన్నారు.ప్రభుత్వం సామాజిక అంశాలపై కాలాయాపన చేయకుండా అర్హులైన  దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలన్నారు.

ప్రతీ గ్రామంలో శ్మశాన వాటికలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్‌ నిర్మించి దళితుల సమస్యలను పరిష్కరించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దళితులపై దాడులను అరికట్టాలనీ ప్రభుత్వాన్ని కోరారు.ఎస్సీ, ఎస్టీ నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలను అందించాలన్నారు.

విద్యా , వైద్యం సామాన్యుడికి అందడంలేదని, విద్యా, వైద్యం ప్రతీ పేదవాడికి అందినప్పుడే బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందనీ తెలిపారు.  రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనీ ఆశించిన యువతకు నిరాశే మిగిలిందనీ, రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, యాదగిరి, మండల నాయకులు రాజయ్య, రాంచెందర్, పవీణ్,ఎల్లేశ్,చంద్రయ్య, రాజు,సత్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు