చంద్రబాబు నిప్పు ఎలా అవుతారు? 

14 Feb, 2020 17:20 IST|Sakshi

చంద్రబాబు పాపం పండింది..

ఐటీ దాడులపై చంద్రబాబు, లోకేష్‌ స్పందించరేం?

పవన్, రామకృష్ణ ఎందుకు నోరు మెదపరేంటి

చంద్రబాబును పచ్చ మీడియా కాపాడలేదు

వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికే చంద్రబాబు హైదరాబాద్‌కు

సాక్షి, తాడేపల్లి: ఐటీ దాడులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. తన సన్నిహితులపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని, బాబు వద్ద సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్‌)గా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్‌ రూ.2వేల కోట​ అక్రమ లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారని అంబటి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. (రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్కు చంద్రబాబు పయనం!)

‘చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌, కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు తనయుడు శరత్‌ ఇళ్లు, కార్యాలయాలు, లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌పై కూడా ఐటీ సోదాలు జరిగాయి. దొరికిపోయారు కాబట్టే చంద్రబాబు, ఆయన కుమారుడు పెదవి విప్పడం లేదు. తండ్రీకొడుకులు ఇద్దరూ హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారు. చంద్రబాబు విదేశాలకు వెళ్లేది లెక్కలు సరిచూసుకోవడానికే. చంద్రబాబు అవినీతి పరుడని ఎన్టీఆర్ చెప్పారు. భారతదేశంలో ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసేది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. లెక్కలు సరిచేసుకొనేందుకే చంద్రబాబు దావోస్, సింగపూర్ వెళ్లారు. (చంద్రబాబు అవినీతి బట్టబయలు)

ఇప్పటికి చంద్రబాబు పాపం పండింది. ఆయన దోపిడీకి పాల్పడ్డరాని మేం మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. బాబు మాజీ పీఎస్‌ను పట్టుకుంటేనే రూ.2వేల కోట్లు దొరికాయంటే.. చంద్రబాబు, లోకేష్‌ను విచారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో? ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌చేయడం చూశాం. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా చంద్రబాబు దొరికిపోయారు. అన్ని కేసుల్లోనూ ఆయన స్టేలు తెచ్చుకున్నారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికే చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లారు. ఆధారాలు దొరికాయి కాబట్టి చంద్రబాబు లోకేష్‌ను అరెస్ట్ చేయాలి. లేకుంటే వ్యవస్థలను మేనేజ్‌చేస్తారు. (ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు)

ఎల్లో మీడియా ఎందుకు రెండువేల కోట్ల గురించి రాయడం లేదు. చంద్రబాబును కాపాడేందుకు ఎల్లో మీడియా తాపత్రాయం పడుతోంది. బాబును ఏ పచ్చ మీడియా కాపాడలేదు. తేలు కుట్టిన దొంగల్లా చంద్రబాబు, లోకేష్‌ నోరు మెదపడం లేదు. మరి పవన్‌ కల్యాణ్‌, సీపీఐ రామకృష్ణకు కూడా తేలు కుట్టిందా? వాళ్లిద్దరూ ఎందుకు మాట్లాడటం లేదు. నిత్యం నీతి వ్యాఖ్యాలు మాట్లాడే పవన్‌, రామకృష్ణ ఏమైపోయారు. చిన్న ఉద్యోగి రెండువేల కోట్ల స్కాం చేయగలడా? ఇప్పుడే తీగ లాగారు.. త్వరలో డొంక కదులుతుంది’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. (ఢిల్లీ ఐటీ బృందాల దాడులు.. వారి గుండెల్లో దడ..!)

మరిన్ని వార్తలు