అధికారంలోకి వస్తే రుణమాఫీ

7 Oct, 2019 03:34 IST|Sakshi

ప్రకటించిన హరియాణా కాంగ్రెస్‌ చీఫ్‌

న్యూఢిల్లీ/చండీగఢ్‌: హరియాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పేదల, రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ కుమారి సెల్జా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే హామీలను నెరవేరుస్తామని, ఎప్పుడు చేస్తామన్న విషయాన్ని వివరించే టైమ్‌లైన్‌ కూడా విడుదల చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో పూర్తవుతోందని, త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. తన్వార్‌ రాజీనామా గురించి మాట్లాడుతూ.. పార్టీ ఆయన్ను స్టార్‌ క్యాంపెయినర్‌గా ప్రకటిస్తే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. తమకు వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత హరియాణా కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.  

మనం భారత్‌మాతా కీ జై అంటే వారు...
కాంగ్రెస్‌ పార్టీ నేతలకు దేశం కంటే అధిష్టానమే ముఖ్యమని, అందుకే వారు సోనియా మాతాకీ జై అంటారని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ వ్యాఖ్యానించారు. గూర్గాన్‌కు చెందిన కాంగ్రెస్‌ నామినీ సోనియా గాంధీకీ జై అంటూ నినాదాలు చేసిన వీడియో బయటకు రావడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీకి దేశం ప్రాధాన్యమని అందుకే తాము భారత్‌ మాతాకీ జై అంటామని పేర్కొన్నారు.  ప్రధాని మోదీ ప్రస్తుతం ప్రపంచ నేతగా ఎదిగారని ఆయన తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాంగ్రెస్‌కి సవాలు విసిరిన టిక్‌టాక్‌ స్టార్‌

సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: కోటంరెడ్డి

వికారాబాద్, రంగారెడ్డి రెండు కళ్లు: సబిత

గాజువాకలో జనసేనకు భారీ ఝలక్‌

వర్సిటీల్లో స్వేచ్ఛ ఎప్పుడు?

కేటీఆర్‌వి అవగాహనలేని మాటలు: ఉత్తమ్‌

మా కూటమికి 200 సీట్లు ఖాయం

ఎన్నికల్లో ‘చిల్లర’ డిపాజిట్‌

ఆర్టీసీ సమ్మె శాశ్వత  పరిష్కారాలపై దృష్టి పెట్టాలి

‘మహా’ యువతకు కాంగ్రెస్‌ వరాలు

ఎస్మా అంటే కేసీఆర్‌ ఉద్యోగాన్నే ప్రజలు తీసేస్తరు

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు 

టీడీపీ నేతకు భంగపాటు

ప్రధాని మోదీతో సీఎం జగన్‌ భేటీ

చిచ్చురేపిన టికెట్ల లొల్లి.. కాంగ్రెస్‌కు షాక్‌!

‘తండ్రీకొడుకులు నాటకాలు ఆడుతున్నారు’

కేటీఆర్‌ రోడ్‌ షో పేలవంగా ఉంది: పొన్నం

జనసేనకు షాకిచ్చిన ఆకుల

వ్యూహం.. దిశానిర్దేశం

‘చంద్రబాబూ నీ బుద్ధి మార్చుకో’

వీళ్లు ప్రచారం చేస్తే అంతే సంగతులు!

‘నేను సవాల్‌ చేస్తున్నా..చంద్రబాబు'

చంద్రబాబు రాజకీయ విష వృక్షం

ఆధారాలతో వస్తా.. చర్చకు సిద్ధమేనా?

ఆర్టీసీని ముంచింది ప్రభుత్వమే: లక్ష్మణ్‌

ఏకం చేసేది హిందూత్వమే

జీ హుజూరా? గులాబీ జెండానా?

మీ ఇంట్లో మహిళల్ని అంటే ఊరుకుంటారా?

అదితికి కాంగ్రెస్‌ షోకాజ్‌​ నోటీసు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పునర్నవి ఎలిమినేషన్‌.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్‌

బిగ్‌బాస్‌ : ఎలిమినేట్‌ అయ్యేదెవరో తెలిసింది!

ప్రేమకు పదేళ్లు.. సమంత స్వీట్‌ పోస్ట్‌

‘ఎఫ్‌2’కు అరుదైన గౌరవం

వార్‌ వసూళ్ల సునామీ

నేనందుకే ప్రమోషన్స్‌కి రాను!