బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి

23 Mar, 2018 02:06 IST|Sakshi

లక్నో: మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా 2019 సాధారణ ఎన్నికలకు ముందే మహాకూటమి ఏర్పాటవుతుందని జేడీయూ మాజీ ఎంపీ శరద్‌యాదవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయకోసం చేసే ఈ పోరాటంలో ఒంటరిగా ముందుకు వెళ్లడం సాధ్యం కాదని, బీజేపీ విస్తరించిన మతతత్వాన్ని అడ్డుకోవాలంటే మహా కూటమిగా ఏర్పడాలని అభిప్రాయపడ్డారు.

‘ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అతిపెద్ద పోరాటం సామాజిక న్యాయం కోసమే. బీజేపీ విస్తరించిన మతతత్వ వాదానికి అడ్డుకట్ట వేస్తేనే ఇది సాధ్యపడుతుంది. 2019 ఎన్నికలకు ముందే బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటవుతుందనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయని, సమాజంలోని ఏ వర్గం బీజేపీపై సంతోషంగా లేరని, ఈసారి బీజేపీ హిందూ–ముస్లిం అజెండా పనిచేయబోదని చెప్పారు.

మరిన్ని వార్తలు